వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోల్డ్ కైన్: భద్రత కోసం ముంబై పోలీసుల కొత్త ప్రయత్నం

|
Google Oneindia TeluguNews

Alert citizens in Ganesh pandals to be rewarded with gold coin
ముంబై: నగర పోలీసులు ప్రజల రక్షణ కోసం వినూత్న ఆలోచన చేపట్టారు. నగరంలోని వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా వుండే పౌరులకు బంగారు నాణెం ఇస్తామని ముంబై నగర పోలీసులు ప్రకటించారు. గణేశ్ మండపాల వద్ద అనుమానాస్పదంగా వున్న వస్తువులను, వాహనాలను, బ్యాగులను, వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారమందించే వారికి ఈ బహుమానాన్ని ఇవ్వనున్నట్లు పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు.

‘ముంబై కేలియే 1 మినిట్' అన్న కార్యక్రమంలో భాగంగా పోలీసులే ఎంపిక చేసిన వినాయక మండపాల వద్ద కొన్ని అనుమానాస్పద వస్తువులను వుంచుతారు. దీనిపై ఎవరైతే పోలీసులకు సమాచారమిస్తారో వారికి బహుమతులను అందజేస్తామని పోలీసులకు తెలిపారు.

ముంబై పోలీసులు, ఐసిఐసిఐ బ్యాంక్ సంయుక్తంగా అప్రమత్తంగా ఉన్న నగర పౌరులకు బంగారు నాణేన్ని అందజేయనున్నారు. పోలీసులు భద్రతపై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా 25వేల పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు.

అంతేగాక సినిమా థియేటర్లలో కూడా ఈ ప్రకటనలు వచ్చేలా చూస్తున్నారు. తాము చేస్తున్న ఈ ప్రయత్నం ఒక మాక్ ఎక్సర్సైజ్‌లా ఉంటుందని నగర పోలీసులు చెప్పారు. మండలపాల వద్ద అదనపు భద్రత ఏర్పాట్లను చేపట్టాలని మండలపాల నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఉగ్రవాదులు తరచూ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటుండటంతో ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

English summary
As part of its holistic anti-terror measures, the Mumbai Police has decided to reward alert citizens who spot unattended, suspicious objects in the vicinity of Ganesh pandals across the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X