వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ చేసి బావిలో తోసేశాడు, 15 గంటలు సజీవంగా

By Pratap
|
Google Oneindia TeluguNews

Allegedly Raped and Pushed Into a Well, She Survived 15-Hour Ordeal
జైపూర్: ఓ 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆమెను దుండగుడు బావిలో పడేశారు. అయితే, ఆ బావి దరిని ఆసరా చేసుకుని 15 గంటల పాటు బావిలో వేలాడుతూ సజీవంగా ఉంది. ఆమెను రక్షించారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.

పొలంలో పనిచేయడానికి వెళ్లినప్పుడు అమ్మాయిపై భిల్వారా పట్టణంలో ఇంటి పొరుగున ఉండే వ్యక్తి దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెను తీసుకుని వెళ్లి బావిలోకి తోసేశాడు. చంపాలనే ఉద్దేశంతో అతను ఆ పనిచేశాడు.

మర్నాడు ఉదయం సహాయం కోసం అరుస్తున్న ఆమెను కొంత మంది చూసి రక్షించారు. ఆమెపై దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. అత్యాచారం, హత్యాప్రయత్నం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

రాత్రంతా తాను నీళ్లలో ఉన్నానని, మర్నాడు ప్రజలు తనను రక్షించడంతో బయటపడ్డానని బాధితారులు చెప్పింది. భారీ వర్షం పడుతుండడంతో రాత్రిపూట ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. బావిలో అమర్చిన మోటారును ఆసరా చేసుకుని ఆమె బావిలో ప్రాణాలను రక్షించుకుంది.

English summary
A 17-year-old girl, allegedly raped and pushed into a well in Rajasthan, survived by hanging on to a ledge for 15 hours till she was rescued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X