వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని ఈశాన్య లడఖ్‌లోని చూమర్ ప్రాంతంలో సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్దితులకు కారణమైన చైనా బలగాలు అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు. గురువారం ఉదయం రెండుదఫాలుగా భారత భూభాగంలోకి ప్రవేశించి దాదాపు 600 మంది చైనా సైనికులు గుడారాలు వేసుకున్నారు. వారికి చైనా హెలికాప్టర్లు క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు సరఫరా చేస్తున్నాయి. సరిహద్దు దాటివచ్చారని, వెనుకకు పోవాలని భారత సైనికులు మొదట సూచించినప్పటికీ చైనా సైనికులు నిరాకరించారని భారత సైనికవర్గాలు తెలిపాయి.

రెండు దేశాల సైనికులు ప్రస్తుతం 200 మీటర్ల దూరంలో ఉండి సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐతే గురువారం రాత్రి 9.45 నుంచి వారి భూభాగంలోకి వెనక్కి మరలడం ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన భారత సైనికులు కూడా క్రమంగా తమ సంఖ్యను తగ్గించుకుంటున్నారు. అంతక ముందు చొరబాటును సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం అక్కడకు మరింతమంది సైనికులను పంపింది.

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

భారత్-చైనా సరిహద్దుల్లో చైనా సైన్యం పదేపదే చొరబాట్లకు పాల్పడటంపై భారత్ ఆందోళనను జిన్‌పింగ్‌కు తెలిపామని ప్రధాని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత, పరస్పర విశ్వాసం పెంపొందించటం తప్పనిసరని ఇరు దేశాలు అంగీకరించాయి.

 ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

మన సరిహద్దు సంబంధిత ఒప్పందాలు, విశ్వాసం కల్పించే చర్యలు మాత్రం సక్రమంగానే పనిచేస్తున్నప్పటికీ వాస్తవాధీన రేఖపై (ఎల్‌వోసీ) స్పష్టత వస్తే అది ఇరుదేశాల మధ్య శాంతి, సుస్థిరతకు ఎంతో తోడ్పడుతుంది. అందువల్ల ఎల్‌వోసీని నిర్ణయించే ప్రయత్నాలు పునరుద్ధరించేందుకు సహకరించాలని జిన్‌పింగ్‌కు సూచించానని అన్నారు.

రెండుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, స్నేహం పెంపొందించేందుకు తాను భారత పర్యటన చేపట్టానని తెలిపారు. ప్రధాని మోడీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు దేశాల మధ్య సరిహద్దును ఇంకా నిర్ణయించాల్సి (డీమార్క్) ఉందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు.

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

ఈ సమస్యలను పరిష్కరించుకొని వివిధ స్థాయిల్లో సరిహద్దు భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకొనే పూర్తి సామర్థ్యం రెండు దేశాలకు ఉంది. అందువల్ల సరిహద్దు సమస్యలు ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపవు. సరిహద్దు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకొనేందుకు భారత్‌తో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు చైనా చిత్తశుద్ధితో ఉందని అన్నారు.

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

భారత్ సాధించిన ప్రగతిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ గొప్ప అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాను అని పేర్కొన్నారు.

 ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

ఫలించిన భేటీ: వెనక్కు తగ్గిన చైనా సైన్యం

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో చైనాలో పర్యటించాలని ప్రధాని మోడీని జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఈ చర్చల్లో రెండు దేశాల విదేశాంగ, వాణిజ్యశాఖల మంత్రులతోపాటు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

English summary
Amid the border stand-off between Chinese and Indian troops, Prime Minister Narendra Modi took up the issue with visiting Chinese President Xi Jinping, saying that solving the boundary issue is a prerequisite for growing economic cooperation between two countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X