వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి పదవి, థాకరేకు అమిత్ షా ఫోన్ కాల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ - శివసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్తబ్దత తొలగించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఉద్దవ్ థాకరేతో ఫోన్లో మాట్లాడారు. సీట్ల విషయమై శివసేన చేస్తున్న ప్రతిపాదనను పునరాలోచించుకోవాలని ఆయన థాకరేను కోరారు.

దాదాపు 25 ఏళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. పొత్తు పెట్టుకోకపోతే రెండు పార్టీలకు నష్ఠమని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో అమిత్ షా చర్చించారు.
శివసేనతో సీట్ల సర్దుబాటు గురించి మోడీ, అమిత్ షాతో ఏకాంతంగా చర్చించారు.

Amit Shah calls Uddhav Thackeray, urges him not to break BJP-Shiv Sena alliance

బీజేపీ-శివసేన సీట్ల సర్దుబాటు గురించి ఆదివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15న జరగనున్నాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ స్దానాల సంఖ్య 288. భారతీయ జనతా పార్టీ మాత్రం చెరో 135 సీట్లలో పోటీ చేద్దామని, మిగిలిన 18 సీట్లను భాగస్వామ్య పక్షాలైన చిన్న పార్టీలకు కేటాయిద్దామని బీజేపీ ప్రతిపాదిస్తుంది.

పొత్తులో భాగంగా తమ పార్టీకి 151 సీట్లు కావాలని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే అన్నారు. బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. అంతేకాకుండా మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని కావాల్సిందేనని ఉద్దవ్ థాకరే భీష్మించుకు కూర్చున్నారు.

ఐతే ఇప్పుడు అమిత్ షా ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరికొన్ని సీట్లను బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చనని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్దానాల్లో పోటీ చేయగా, ఎన్‌‌సీపీ 114 సీట్లలో పోటీ చేసింది.

English summary

 BJP President Amit Shah on Monday called on Shiv Sena Chief Uddhav Thackeray, urging him not to break the 25-year old alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X