వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెండితెర సీత అంజలీ దేవి కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Anjali Devi
చెన్నై: ప్రముఖ నటి అంజలీ దేవి సోమవారం కన్నుమూశారు. వెండితెర సీతగా పేరుగాంచిన అంజలీ తమిళనాడు రాజధాని చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. 1927 ఆగస్టు 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి.

గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆమె ఐదువందలకు పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. అప్పటి నుండి వెండితెర సీతగా పేరుగాంచారు.

లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బండిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు. అంజలీ దేవి భర్త ఆదినారాయణ రావు సంగీత దర్శకులు.

అంజలి పిక్చర్స్ పతాకంపై పలు సినిమాలను నిర్మించారు. నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డులను అంజలి దేవిని అందుకున్నారు.

అంజలీ దేవి చివరి చిత్రం బిగ్ బాస్. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. రంగస్థలం ద్వారా నట జీవితాన్ని ఆరంభించారు.

English summary
Well Known actress Anjali Devi died on Monday in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X