చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడిగి మరీ, జయని కలిసిన ష్వార్జ్‌నెగ్గర్ రిక్వెస్ట్! ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ సోమవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో భేటీ అయ్యారు. వారి సమావేశం వివరాలు అరగంట సేపు మీడియాకు అందలేదు. ఆమెతో దాదాపు ఇరవై నిమిషాల పాటు అర్నాల్డ్ మధ్యాహ్నం భేటీ అయ్యారు.

సమాచారం మేరకు.. అర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తమిళనాడు సీఎం జయలలిత గురించి గతంలో విన్నారు. ఆమెతో భేటీ కావాలని భావించారు. జయతో భేటీ కోసం అర్నాల్డ్ టీం ముఖ్యమంత్రి కార్యాలయానికి కొద్ది రోజుల క్రితం సమాచారం పంపించింది. భేటీ అనంతరం ష్వార్జ్‌నెగ్గర్ కెమెరాలకు పోజులు ఇచ్చారు. అనంతరం ఆయన అక్కడి నుండి ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్లారు. కాగా, జయలలిత ప్రవేశ పెట్టిన పథకాలను ష్వార్జ్‌నెగ్గర్ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది.

arnold schwarzenegger meets cm jayalalitha

ప్రముఖ దర్శకుడు శంకర్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఐ' సినిమా ఆడియో విడుదల సందర్భంగా స్వార్జ్‌నెగ్గర్ తమిళనాడు రాజధాని చెన్నై వచ్చారు. ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు.

కాగా, శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన 'ఐ' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో సోమవారం సాయింత్రం ఘనంగా జరిగింది. 'శంకర్‌.. మీరు అవకాశమిస్తే మీ చిత్రంలో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నా' అని హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ తన మనోగతాన్ని వెల్లడించారు.

English summary
After meeting TN chief minister Jayalalitha the hollywood superstar Arnold appreciated the schemes that were implemented by the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X