వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌నాథ్ 'వాస్తు' ఆలోచన: చిరంజీవికి తాత్కాలిక ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి తాత్కాలిక ఊరట లభించినట్లుగా కనిపిస్తోంది. 17, అక్బర్ రోడ్డులోని చిరంజీవి బంగ్లాను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. చిరంజీవి ఖాళీ చేస్తే.. అందులోకి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లాల్సి ఉంది. ఈ బంగ్లాను చిరు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా తీర్చిదిద్దిన బంగ్లాను రాజ్‌నాథ్‌కు కేటాయించారు.

అయితే, ప్రస్తుతం రాజ్‌నాథ్ సింగ్ ఈ బంగ్లాలోకి ఇప్పటికిప్పుడే మారేందుకు ఆసక్తి చూపించడం లేదట! అందుకు వాస్తు కారణమని చెబుతున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవికి 2012లో 17, అక్బర్ రోడ్డులో టైప్ 8 బంగ్లాను కేటాయించారు.

ఇప్పుడు ఆయన మాజీ మంత్రి కావడంతో.. తాను రాజ్యసభ సభ్యుడిని అయినందున తనకు అర్హమైన మరో బంగ్లాను చూపించాలని చిరంజీవి సంబంధిత శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ కూడా రాశారు.

‘Bad vaastu’ shields Chiranjeevi

ఇదిలా ఉండగా.. చిరు బంగ్లాను తనకు కేటాయించినప్పటికీ రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికిప్పుడు తాను ప్రస్తుతం నివసిస్తున్న అశోక రోడ్డులోని భవనాన్ని ఖాళీ చేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదట. అందుకు చిరు నివాసం ఉంటున్న బంగ్లాలో వాస్తుదోషం ఉండటమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఖాళీ చేశాక.. బంగ్లాలో మార్పులు చేర్పులు చేసి మారే అవకాశాలు ఉండవచ్చు.

మరోవైపు, తాను బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకు మరో బంగ్లా కేటాయించాల్సి ఉందని, ప్రస్తుతం తాను నివసిస్తున్న బంగ్లాను రాజ్‌నాథ్ సింగ్‌జీకి కేటాయించినట్లుగా తెలుస్తోందని చిరంజీవి చెబుతున్నారట.

English summary

 Former Union minister for tourism and Rajya Sabha Congress member Chiranjeevi got temporary relief from vacating his present residence, due to second thoughts by the Union home minister Rajnath Singh, who was allotted the bungalow of actor-turned-politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X