వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ బంద్: టెక్ సిటీ డైలమా, బలగాలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: మహిళలు, పిల్లలపై పెరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం బెంగళూర్ బంద్ జరుగుతోంది. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం 17 వేల మంది పోలీసులను మోహరించింది.

ఆర్ఎఎఫ్, సిఎఆర్, హోమ్ గార్డులు రంగంలోకి దిగారు. అత్యవసర సర్వీసులు కొనసాగుతాయా, లేదా అనే స్పష్టత ఇవ్వకపోవడంతో నగరంలో అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. బస్సులు, ఆటోలు తిరుగుతున్నాయి.

బంద్ జరిగే ప్రశ్నే లేదని, అన్ని సంస్థలూ పనిచేస్తాయని పబ్లిక్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ మొహమ్మద్ మోసిన్ అన్నారు. బంద్ సందర్భంగా ప్రైవేట్ సంస్థలు సాధారణంగా ఇచ్చే అలర్ట్ నోటీసును ఈసారి జారీ చేయలేదు. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బంద్‌కు మద్దతు ప్రకటించింది. కొంత మంది ఉపాధ్యాయులు కూడా మద్దతు ప్రకటించారు.

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

బంద్‌తో బెంగళూర్‌లోని రోడ్లు దాదాపు నిర్మానుష్యంగా కనిపించాయి. వాహనాలు కూడా పెద్దగా తిరగడం లేదు.

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

మహిళలు, పిల్లలపై పెచ్చరిల్లుతున్న నేరాలకు నిరసనగా 50 కన్నడ సంఘాలు గురువారంనాడు బంద్‌కు పిలుపునిచ్చాయి.

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

తాము విధులకు హాజరు కాబోమని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చెప్పారు. వారు బంద్‌కు మద్దతుగా నిలిచారు.

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద యెత్తున బలగాలు మోహరించాయి.

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

విబ్జియార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిన నేపథ్యంలో కన్నడ సంఘాలు ఈ బంద్‌ను తలపెట్టాయి

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

కన్నడ సంఘాలన్నీ కన్న ఒకూట (సమాఖ్య)గా ఒకే గొడుగు కిందికి వచ్చి బంద్ తలపెట్టాయి. ఈ సమాఖ్యకు వతల్ నాగరాజు నాయకత్వం వహిస్తున్నారు.

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను కూడా రప్పించారు. వేయి మంది హోం గార్డులు కూడా రంగంలోకి దిగారు.

బెంగళూర్ బంద్

బెంగళూర్ బంద్

బంద్ సందర్భంగా కొన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాయి. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ప్రజలు బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు.

English summary
Without wasting its time, state administration deployed at least 17,000 police personnel across Bangalore where 50 pro-Kannada groups called for a bandh (strike) on Thursday, July 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X