వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ రేప్: తెలిసినా కప్పిపుచ్చే ప్రయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bengaluru rape case: School staff knew, washed child, hid crime
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని విబ్జియార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు జిమ్నాస్టిక్స్ ఇన్‌స్ట్రక్టర్స్ లాల్‌గిరి (21), వసీం పాషా (28)లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో స్కేటింగ్ టీచర్ మొహ్మద్ ముస్తఫా అలియాస్ మున్నాకు ఏ విధమైన పాత్ర లేదని పోలీసులు తేల్చేశారు. తప్పుగా అర్థం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. గతంలోని అతని ప్రవర్తన కారణంగా అతన్ని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు.

తన పట్ల చెడుగా ప్రవర్తించిన ఇద్దరిని బాలిక గుర్తించిందని అంటున్నారు. బాధితురాలితో జిమ్ వెనక ఉన్నట్లు సిసిటివీలో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది.

నేరాన్ని కప్పిపుచ్చడానికి పాఠశాలలో ప్రయత్నాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగిన విషయం పాఠశాల సిబ్బందికి తెలిసినా దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అత్యాచారానికి గురైన తర్వాత మూడు రోజులు కూడా బాలిక బలవంతంగా పాఠశాలకు వెళ్లినట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు సమస్యను గుర్తించే వరకు ఎవరూ నోరు మెదపలేదని సమాచారం. చివరకు జులై 11వ తేదీన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు.

తల్లిదండ్రులు జులై 14వ తేదీన ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు గిరి, పాషాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిని 16వ తేదీన వదిలేసి, పాత నేరచరిత్ర ఉన్నందున ముస్తఫాను అరెస్టు చేశారు.

జులై 3వ తేదీన బాలికతో పాటు 12 మంది విద్యార్థులు జిమ్ క్లాసుకు వెళ్లారు. క్లాసు ముగిసిన తర్వాత మిగతా వారిని పంపించి బాలికను మాత్రం ఉంచేసుకున్నారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు.

English summary
In a major breakthrough in the Vibgyor child rape case, the city police have arrested two gymnastic instructors, Lalgiri, 21, and Waseem Pasha, 28, who had gang-raped the first standard student on July 3rd at the school gymnasium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X