వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ - శివసేన సీట్ల సర్దుబాటు బెడిసి కొడుతుందా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

BJP says ‘insulted’ as Shiva Sena offers only 119 seats in Maharashtra
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ - శివసేన పార్టీల మధ్య కలకలం రేపుతోంది. తాము కోరిన 144 (126 బీజేపీ, 18 ఇతరులు) స్దానాలను ఇవ్వడానికి అంగీకరించాలంటూ శివసేనకు భారతీయ జనతా పార్టీ శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా శివసేన స్పందించకపోతే పొత్తు రద్దు చేసుకోవడానికి వెనుకాడబోమని అమిత్ షాని పూణెలో గురువారం రాత్రి కలిసిన మహారాష్ట్ర బీజేపీ నేత ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఫోన్ కాల్‌లో ఈ విషయాన్ని తెలిపారు.

తాము కోరిన 144 (126 బీజేపీ, 18 ఇతరులు) స్దానాలను ఇవ్వని పక్షంలో బీజేపీ సొంతంగా అన్ని స్దానాల్లో పోటీకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అహ్మాద్‌నగర్ లోని చొండి పబ్లిక్ ర్యాలీలో వెల్లడించనున్నారు. ఐతే శివసేన స్పందన మరోలా ఉంది. శివసేన ఎంపీ ఒకరు మాట్లాడుతూ శివసేనను అమిత్ షా పూర్తిగా మరచిపోయారు. బీజేపీ ఎందుకంత ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగానే పోటీ చేయమనండి అని పేర్కొన్నారు.

2009లో జరిగిన ఎన్నికల్లో శివసేన 169 సీట్లలో పాల్గోందని, కానీ ఇప్పుడు 150 సీట్లలో పాల్గొనడానికి ఒప్పందం కుదిరినా బీజేపీ ఒప్పుకోవడం లేదన్నారు. మహారాష్ట్రలో శివసేన పెద్ద పార్టీ అన్న విషయాన్ని గమనించాలన్నారు. శివసేన మాత్రం బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన సీట్లలో ఆ పార్టీ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడంతో పొత్తులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

వచ్చే నెలలో మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్దానాల్లో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రావడం లేదు. మహారాష్ట్ర శివసేన పెద్ద పార్టీగానూ, బీజేపీ చిన్న పార్టీగానూ పొత్తులో భాగమని శివసేన భావిస్తుంది.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనను కనబర్చడంతో పొత్తుల సమీకరణను మార్చాలని డిమాండ్‌ చేసింది.

కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, శివసేన చెరో 135 స్థానాల్లో పోటీ చేయాలని, మిగిలిన 18 సీట్లను చిన్న చిన్న పార్టీలకు కేటాయించాలని బీజేపీ వాదిస్తుంది. అయితే గత శనివారం 9 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీకి 119 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమని శివసేన స్పష్టం చేస్తుంది.

English summary
The Shiv Sena has asked the BJP to take 119 seats out of 288 Assembly seats if it wants to continue the alliance. What is more shocking is that the Sena has indicated that within the 119 seats it should also include its smaller alliance partners. The party’s aggression has come as a major shock to the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X