వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామమందిరం, మైనార్టీలు: బిజెపి మేనిఫెస్టో అంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BJP unveils poll manifesto
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సోమవారం ఉదయం ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో రామమందిర నిర్మాణ సాధ్యాసాధ్యాలు, మైనార్టీలకు అవకాశాలు తదితర అంశాలను పొందుపర్చింది. ఈ మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, అద్వానీలు విడుదల చేశారు. ఒక దేశం.. మహోన్నత భారత్ బిజెపి ఉద్దేశ్యమన్నారు.

17 మంది సభ్యులు దీనిని రూపొందించారు. పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలో ఈ ప్రణాళికను రచించారు. మనోహర్ జోషీ ప్రణాళికను చదివి వినిపించారు. ప్రణాళిక రూపకల్పణకు లక్ష సూచనలు అందాయని జోషీ చెప్పారు. రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తల నుండి సూచనలు అందినట్లు చెప్పారు. మేనిఫెస్టోలో రూపొందించిన కొన్ని కీలక అంశాలు...

ఉపాధి కల్పనకు ప్రాధాన్యత
అవినీతి నిర్మూలనక, నల్లధనం అంశాలకు ప్రాధాన్యత
పాలనలో పారదర్శకత
బ్రాండ్ ఇండియా రూపొందిస్తాం
అందరికీ ఆహార భద్రతకు ప్రణాళిక
పర్యాటక అభివృద్ధికి కొత్త సర్క్యూట్ ఏర్పాటు
వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి
ఎస్సీ, ఎస్టీల సాధికారతకు కృషి
ప్రతి రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక పోలీసు విభాగం
పోలీసు, న్యాయ, పరిపాలన విభాగాల్లో సంస్కరణలు
ప్రతి గ్రామాన్ని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయడం
ప్రతి ఒక్కరికి తాగునీరు, ప్రతి రైతుకు సాగునీరు
తీవ్రవాద నిరోధానికి ప్రత్యేక యంత్రాంగం
నూతన వైజ్ఞానిక ఆవిష్కరణతోనే భారత్ పురోగతి
అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రణాళిక
నల్ల బజారు నివారణకు ప్రత్యేక కోర్టులు
పన్నుల విధానంలో సంస్కరణలు
సమానత్వ సాధనకు ఉమ్మడి పౌరస్కృతి
విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెప్పించడం
మల్టీ బ్రాండ్ రిటైల్లో ఎఫ్‌డిఐలకు వ్యతిరేకం
రామ మందిర నిర్మాణ సాధ్యాసాధ్యాలు
మైనార్టీలకు సమాన అవకాశాలు, మదర్సాల ఆధునికీకరణ
హిమాలయాల అభివృద్ధి

English summary
Himalaya is a boon for our country and we plan to focus on this eco-system: MM Joshi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X