వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో దూషణ: పాక్‌లోముగ్గురు మహిళల హత్య

|
Google Oneindia TeluguNews

'Blasphemy' on Facebook: Mob kills 3 women in Pakistan
ఇస్లామాబాద్: తమ దైవాన్ని దూషిస్తూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో పలు పోస్టులు చేశారన్న ఆరోపణలతో ఓ మహిళతోపాటు ఆమె ఇద్దరు మనుమరాళ్లను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. వీరందరూ పాకిస్థాన్ దేశంలో మైనార్టీ వర్గానికి చెందిన అహ్మాదీ ముస్లిం వర్గానికి చెందినవారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని తూర్పు ప్రాంతంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. అహ్మాదీ వర్గానికి చెందిన ముస్లింలు దూషణలతో కూడిన కాబా(సౌదీ అరేబియాలోని మక్కాలోని గ్రాండ్ మసీదులో క్యూబ్ ఆకారంలో ఉన్న నిర్మాణం) ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారని వార్తలు వెలువడటంతో ఆదివారం సాయంత్రం నుంచి అల్లర్లు చోటు చేసుకున్నాయి.

వారు అప్‌లోడ్ చేసిన ఫొటో న్యూడిటీని కలిగి ఉన్నట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. కాగా, చెలరేగిన అల్లర్లలో ఆ వర్గానికి చెందిన ఇద్దరు చిన్నారులతోపాటు ఓ మహిళలు గాయపడి మృతి చెందారని తెలిపారు.

అల్లర్లలో మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. అల్లర్లను నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్‌లో ఉన్న క్రిస్టియన్, హిందూ, సిక్కు, అహ్మాదీ వర్గానికి చెందిన ముస్లింలను చాలా కాలం నుంచి ఇస్లాం తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

English summary
A mob set several homes of minority Ahmadi Muslims ablaze in the country's east, killing a woman and her two granddaughters following rumors about blasphemous postings on Facebook, said a Washington Post report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X