వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఫలితాలు: అఖిలేష్ జోష్, బిజెపికి ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

By-poll Results: Samajwadi Party Gains in UP
లక్నో: మహిళలపై అత్యాచారాల ఘటనలతో ప్రతిష్ట కోల్పోయారని భావించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఉప ఎన్నికల ఫలితాలు జోష్‌ను ఇచ్చాయి. బిజెపిని ఆందోళనలో ముంచెత్తాయి. ఫలితాల వెల్లడికి ముందు ఫలితం ఏదైనా సరే, 2017కు స్ఫూర్తిగా తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని 11 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఆరు సీట్లను గెలుచుకుని మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ప్రజలు మతశక్తులను తిరస్కరించారని ఫలితాలపై అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

నాలుగు నెలల క్రితం జరిగిన లోకసభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికల ఫలితాలు ఆందోళన కలిగించేవే. యుపిలోని 80 లోకసభ స్థానాల్లో బిజెపి 71 స్థానాలు గెలుచుకుంది. ఎస్పీకి ఐదు స్థానాలు, కాంగ్రెసుకు రెండు స్థానాలు మాత్రమే లభించాయి.

ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగిన 11 స్థానాలు కూడా బిజెపి, దాని మిత్రపక్షం ఖాళీ చేసినవే. ఇవి 2012 ఎన్నికల్లో గెలిచిన ఈ సీట్లను బిజెపి, దాని మిత్ర పక్షం కోల్పోయాయి. 2017లో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉప ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడదు యోగి ఆదిత్యానాథ్ బిజెపి ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. ఉప ఎన్నికల్లో అపజయం ఆయనకే వర్తిస్తుందని అంటున్నారు. లవ్ జిహాద్‌పై ఆదిత్యానాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బిజెపిని దెబ్బ తీశాయని భావిస్తున్నారు.

English summary

 Hours after Uttar Pradesh Chief Minister Akhilesh Yadav tweeted about "drawing inspiration for 2017, no matter what the outcome" of by-polls in the state, early trends brought heartening news for his Samajwadi Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X