వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 2: యుపిలో లేని బిజెపి గాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ ఎన్నికల్లో వీచిన గాలి శాసనసభ ఉప ఎన్నికల్లో కనిపించలేదు. ఈ రాష్ట్రంలో 11 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఎస్పీ 9 స్థానాలను గెలుచుకుని మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజెపి రెండు స్థానాలను మాత్రమే దక్కించుకుంది.

గుజరాత్ శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు రెండు స్థానాలను గెలుచుకుని నైతిక బలాన్ని సాధించింది. 9 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి బిజెపి ఐదు స్థానాలను నిలబెట్టుకుని రెండు స్థానాలను కోల్పోయింది.

గుజరాత్‌లోని వడదొర లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్‌పురిలో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. వడదొరకు ప్రధాని నరేంద్ర మోడీ, మైన్‌పురికి ఎస్పీ అధినేత ములాయం సింగ్ రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి.

వడదొర లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థికి మెజారిటీ తగ్గింది. కాగా, 24 శాసనసభ సిట్టిం్ స్థానాల్లో 14 స్థానాల్లో వెనుకంజలో ఉంది.

గుజరాత్ శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి ఏడు స్థానాల్లో ఆధిక్యంలోకి రాగా, కాంగ్రెసు ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఎస్పీ 9 స్థానాల్లో బిజెపి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

గుజరాత్‌ శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి ఆరు స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. ఇంతకు ముందు ఐదు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెసు ఆధిక్యత నాలుగు నుంచి మూడు స్థానాలకు తగ్గింది.

తాజా ఫలితాల ధోరణులను బట్టి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఎస్పీ తన ఆధిక్యాన్ని చాటుతోంది. ఎనిమిది స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో ఉండగా, మూడు స్థానాల్లో మాత్రమే బిజెపి ఆధిక్యంలో ఉంది. కాగా, గుజరాత్‌లోని తొమ్మిది శాసనసభా స్థానాల్లో కాంగ్రెసు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది కాంగ్రెసుకు ఊరట కలిగించే విషయం. 5 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన నాలుగు స్థానాల్లో బిజెపి వెనుకంజలో ఉండడం విశేషం

ఉత్తరప్రదేశ్ రాష్టంలోని శాసనసభ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో ఉండగా, గుజరాత్‌లో మూడు స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి ఎదురు దెబ్బ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోని 32 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంతకు ముందు తన చేతిలో ఉన్న 13 స్థానాలను కోల్పోయే పరిస్థితి ఉంది. కాంగ్రెసు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ప్రాతినిధ్యం వహించిన ఆరు స్థానాల్లో అది ఆధిక్యత సాగిస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 7 శాసనసభా స్థానాల్లో ఎస్పీ, నాలుగు స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉన్నాయి. గుజరాత్‌లోని 9 శాసనసభ స్థానాల్లో ఐదింట బిజెపి, నాలుగింట కాంగ్రెసు ఆధిక్యంలో ఉన్నాయి. ఈ నాలుగు సిీట్లు కూడా ఇంతకు ముందు కాంగ్రెసుకు చెందినవి కాకపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 3 లోకసభ స్థానాకలకు, 33 శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. త్వరలో జరిగే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభా ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 11 శాసనసభా స్థానాల్లో ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. వీటిలో మెజారిటీ స్థానాలను బిజెపి గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే, దాని ప్రభావం మోడీ కేంద్ర ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు.

Bypolls in India: Counting of votes begin

అలాగే, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 9 లోకసభ స్థానాలకు, వడదొర పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల ప్రభావం కూడా మోడీ ప్రభుత్వంపై ఉంటుంది.

English summary
Counting of votes begin in 10 states for 3 Lok Sabha seats and 33 assembly seats. Uttar Pradesh has gone bypolls for 11 assembly segments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X