వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంలో కోల్‌గేట్: మొత్తమైనా అభ్యంతరం లేదు కానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కోల్ బ్లాక్ కేటాయింపుల పైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. రద్దు చేయాలనుకుంటే 218 లైసెన్సులు రద్దు చేయవచ్చని అటార్నీ జనరల్ చెప్పారు.

218 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో 80 క్షేత్రాలను రద్దు చేసినట్లు తెలిపారు. మిగిలిన 138 క్షేత్రాల్లో 40 కోల్ బ్లాక్స్‌లో మైనింగ్ ప్రారంభమైందని చెప్పారు. వాటికి సంబంధించిన కేంద్రాలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 40తో పాటు మరో ఆరింటిలో మైనింగ్ మొదలవ్వనప్పటికీ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Coal blocks allocation: SC judgement today

46 మినహాయించి మిగతా వాటి పైన చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్ కోరారు. ఒకవేళ మొత్తం కేటాయింపుల పైన నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే, వాటిని రద్దు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందన్నరు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

English summary
Coal blocks allocation: Supreme Court judgement today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X