వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: మంచినీరు తాగిన దళిత విద్యార్దులు సస్పెండ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Dalit students drink teacher’s water, dismissed
న్యూఢిల్లీ: దేశంలో ఇంకా కొన్ని చోట్ల కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనం రాజస్దాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. అగ్రకులానికి చెందిన ఓ ఉపాధ్యాయుని కోసం ఏర్పాటు చేసిన కుండలోని మంచినీటిని తాగిన పదకొండు మంది దళిత విద్యార్దులను సస్పెండ్ చేశారు.

రాజస్థాన్‌లో బికనీర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. బికనీర్‌కు 70 కిమీ దూరంలో ఉన్న తట్ గ్రామంలో ఈ ఘటన సెప్టెంబర్ 1న జరిగితే ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో పనిచేస్తున్న అగ్రకులానికి చెందిన మంగల్ సింగ్ ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారు. తాను తాగటానికి ఉంచుకున్న నీరును ఈ విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని భావించి మంగళ్‌సింగ్ ఈ విద్యార్థులను సస్పెండ్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్దుల తల్లిందండ్రులు మంగిలాల్, ప్రకాష్ రామ్ మెగ్వాల్ ఇద్దరూ ఉపాధ్యాయుడి ప్రశ్నించగా... తాను తాగటానికి ఉంచుకున్న నీటిని విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

ఈ విషయంపై తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆర్తీ డోగ్రా మాట్లాడుతూ స్కూలు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇద్దరిని ఆ గ్రామానికి వెళ్లి డిటేల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.

English summary

 Eleven children, all cousins belonging to a Scheduled Caste family, were removed from a government primary school in a village in Bikaner after two of them drank water from an earthen pot meant for an upper caste teacher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X