వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్నెవరూ ఆపలేరు.. కానీ: ఎన్నికల్లో పోటీపై ప్రియాంక

|
Google Oneindia TeluguNews

Decision to not contest is personal: Priyanka Gandhi on challenging Narendra Modi
న్యూఢిల్లీ: తాను భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసి లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ‘నరేంద్ర మోడీపై పోటీ చేయాలని ప్రియాంక గాంధీ ముందుకు వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకత్వం ఆమెను వారించారు.'

‘మోడీ ప్రధాని కావడం దేశానికి మంచిది కాదు. ఆయన్ను అడ్డుకోవాలి' అని ప్రియాంక గాంధీ భావించినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే ప్రియాంక గాంధీ సోమవారం ఈ కథనాన్ని ఖండించారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ప్రచారానికే పరిమితమవుతానని, అది కూడా తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ పోటీ చేస్తున్న స్థానాల్లోనే ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.

ఒక వేళ తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ తనను ఆపలేరని ప్రియాంక గాంధీ అన్నారు. తాను పోటీ చేయాలనుకుంటే తన భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీసుకున్న తన నిర్ణయం వ్యక్తిగతమేనని ప్రియాంక చెప్పారు. ఆ నిర్ణయం మళ్లీ తాను మార్చుకోవాలనుకుంటేనే మారుతుందని స్పష్టం చేశారు. కాగా, ప్రియాంక గాంధీ.. ప్రస్తుతం సోనియా గాంధీ లోకసభ స్థానానికి పోటీ చేస్తున్న రాయ్ బరేలి, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలలో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు.

English summary
Priyanka Gandhi Vadra, the daughter of Congress president Sonia Gandhi, Monday denied reports that she wanted to contest against BJP's prime ministerial candidate Narendra Modi from the Varanasi Lok Sabha constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X