వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ నుంచి కోటి 30లక్షలు కాజేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

|
Google Oneindia TeluguNews

Dehradun woman duped of Rs.1.30 cr by Facebook friend
డెహ్రాడూన్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్న వ్యక్తి.. ఆమె దగ్గర ఏకంగా రూ. 1.30 కోట్ల రూపాయలను కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లోని రాంవిహార్‌లో నివసించే ఓఎన్‌జిసి ఉద్యోగి భార్య బీనా బోర్ ఠాకూర్‌కి కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.

ఆ పరిచయం పెరిగి ఫోన్‌లో చాటింగ్ చేసేంత వరకు వెళ్లింది. రిచర్డ్ అండర్సన్‌గా తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. భారతదేశంలో ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని ఉందని చెప్పాడు. అందుకోసం ఆమె నుంచి సలహాలు కూడా తీసుకున్నాడు. ఇద్దరూ బాగా చర్చించుకుని చివరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఓ వృద్ధాశ్రమం నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం రూ. 9 కోట్లు పంపిస్తానని అతడు చెప్పాడు.

కొద్ది రోజులకే బీనాకు మరో వ్యక్తి ఫోన్ చేసి తాను రిజర్వు బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ శాఖ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి.. మీరు కొంత మొత్తం టాక్స్ కడితే రూ. 9 కోట్లు తీసుకోవచ్చని ఆమెకు తెలిపాడు. ఆ మాటలు నమ్మిన బీనా ఆ వ్యక్తి చెప్పిన మొత్తం 25 ఖాతాలకు రూ. కోటి 30 లక్షల రూపాయలను తన ఖాతా నుంచి బదిలీ చేసింది.

కాగా, తనకి రూ. 9 కోట్ల డబ్బు అందకపోవడం, రిచర్డ్ నుంచి ఫోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీనా డబ్బు బదిలీ చేసిన ఖాతాలను తనిఖీ చేసి చూస్తే అవి కేరళ, తమిళనాడు, కర్ణాటకలకు చెందినవిగా తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఖాతాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు తెలిపారు.

English summary

 A woman was duped of Rs.1.30 crore by a "friend" she had made on Facebook.
 The woman, Beena Bor Thakur, a resident of Ram Vihar, Dehradun, had been assured by her friend that he would get her $1.5 million (about Rs.9 crore) to open an old-age home in Dehradun. Thakur is the wife of an ONGC employee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X