వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుగా జింగ్‌పింగ్ పేరు, ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Doordarshan sacks newsreader for reading Chinese President Xi Jinping's name wrong
హైదరాబాద్: చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ పేరును తప్పుగా పలికినందుకు దూరదర్శన్ ఓ న్యూస్ రీడర్‌ను తొలగించినట్లుగా తెలుస్తోంది. జీ జిన్‌పింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చి, ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ పేరు ఉచ్చారణలో తప్పు దొర్లడంతో న్యూస్ రీడర్‌ను తొలగించారు.

ఈ విషయాన్ని ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ స్వయంగా చెప్పారని వార్తలు వస్తున్నాయి. చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌లో తొలి జీని ఆంగ్లంలో ఎక్స్, ఐ అనే రెండు అక్షరాల సమాహారంగా రాస్తారు. రోమన్ అంకెల్లోని '11' కూడా ఈ రెండు అక్షరాల మాదిరిగానే ఉంటుంది.

దీంతో సదరు న్యూస్ రీడర్.. చైనా అధ్యక్షుడి పేరును ఎలెవెన్ జిన్ పింగ్‌గా ఉచ్చరించింది. దీంతో ఆమెకు ఉద్వాసన పలికారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని జవహర్ సర్కార్ చెప్పారు. అయితే, ఆమె క్యాజువల్ బేసిస్ ఉద్యోగి అని, ఆమెను కొన్ని నెలల పాటు తొలగించామని మరో అధికారి చెప్పినట్లుగా తెలుస్తోంది.

English summary

 Doordarshan has sacked a newsreader for slipping up and pronouncing the name of Chinese President Xi Jinping wrong, while reporting about his arrival in Delhi for talks with Prime Minister Narendra Modi. The newsreader reportedly confused the Chinese head of state's name - Xi - for the Roman numeral XI, and read his name out "Eleven Jinping", according to Quartz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X