వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసి అధికారులను చితగ్గొట్టిన దీదీ పార్టీ వర్కర్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

EC personnel beaten up in Bengal allegedly by Trinamool workers
కోల్‌కోతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్ అధికారులను చితగ్గొట్టారు. మాల్దా జిల్లాలోని మనిక్చక్‌లో తృణమూల్ కాంగ్రెసు బైక్ ర్యాలీని వీడియో తీస్తున్నందుకు వారికి ఆగ్రహం వచ్చింది. దాంతో వారు ఈసి అధికారులను కొట్టారు.

తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తల తీరుపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ముందు వీడియో ఫుటేజ్‌ని పరిశీలించాలని డిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించుకున్నారు.

గురువారం సాయంత్రంలోగా సంఘటనపై నివేదిక సమర్పించాలని ఈసి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు కోల్‌కతాలో ఈసి డైరెక్టర్ ధీరేంద్ర ఓఝా చెప్పారు. బైక్ ర్యాలీని నలుగురు అధికారులు వీడియో తీయడానికి పూనుకున్నారు. ఈ సమయంలో టిఎంసి కార్యకర్తలు వారిలో ఇద్దరిని కొట్టారు.

బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి సంఘటనపై విచారణ జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా హింస పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఇటీవలి ఈసి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

English summary
Two Election Commission personnel were on Thursday beaten up while they were videographing a bike rally by Trinamool workers at Manikchak in Malda district, inviting the ire of the poll body which has directed authorities to initiate stern action against the accused and file a report on the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X