వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్ ఫ్రెండ్స్ కోసం బ్యాంకులను దోచిన మాజీ సైనికోద్యోగి

By Pratap
|
Google Oneindia TeluguNews

భోపాల్: తన ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్‌ను సంతోషపెట్టడానికి ఓ మాజీ సైనికోద్యోగి 9 బ్యాంకులను దోచుకున్నాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని షయోపూర్ యూకో బ్యాంక్ శాఖ నుంచి రూ.36.46 లక్షలను దొంగిలించిన అనిల్ రజావత్ హిమాచల్ ప్రదేస్‌లోని సోహాన్‌లో పట్టుబడ్డాడు.

తాను మొత్తం తొమ్మిది బ్యాంకులను దోచుకున్నట్లు అతను పట్టుబడిన సందర్భంగా చెప్పాడు. సైన్యంలో ఏడేళ్ల పాటు విధులను నిర్వహించిన అనిల్ శిక్షణలో గ్యాస్ కట్టర్లను వాడి బలమైన తలుపులను కూడా ఛేదించే విద్యను నేర్చుకున్నాడు.

Ex-serviceman robs nine banks to splurge money on three girlfriends

బయటకు వచ్చిన తర్వాత దానినే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. ఇద్దరు స్నేహితుల సాయంతో అతను 9 బ్యాంకుల్లో దోపిడీకి పాల్పడ్డాడు. దోచుకున్న డబ్బుతో గర్ల్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అతనికి సాయపడిన మిత్రులను ఇట్టావాకు చెందిన ముఖేష్ కేవత్, పల్లికి చెందిన బన్వరీ కీరు‌గా గుర్తించారు. తొలుత ముగ్గురు రెక్కీ నిర్వహించి, ఆ తర్వాత బ్యాంకులను దోచుకున్నారు.

English summary
An ex-Army man allegedly robbed nine banks only so that he could gather enough money to splurge on three of his girlfriends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X