వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి బాగోతాన్ని బయటపెట్టిన ఫేస్‌బుక్: మహిళ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

Executive held after 'single' status busted on FB
గుర్గావ్: ఓ యువతికి ప్రముఖ మాట్రిమోనియల్ ద్వారా పరిచయమైన వ్యక్తి.. ఆమెను వివాహమాడతానని ప్రతిపాదన చేశాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత ఆమె ఫేస్‌బుక్‌లో తన భర్త ప్రొఫైల్‌ను చూసింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే.. అప్పటికే ఆమె వివాహం చేసుకున్న వ్యక్తికి వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది.

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గురువారం అతడ్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ సంస్థకు డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు నిందితుడైన ప్రణవ్ ముఖర్జీ(46).

ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న బాధిత యువతి(35)ని మాట్రిమోనియల్ సైట్‌లో చూసి నచ్చవంటూ రిక్వస్ట్ పెట్టాడు. తర్వాత రెండు నెలలపాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత రిజిస్టర్ వివాహం చేసుకుని మహారాష్ట్రలోని పుణెకు వెళ్లిపోయారు. 2014లో గుర్గావ్‌కు తమ కాపురాన్ని మర్చారు.

కాగా, ఇటీవల బాధిత మహిళ ఫేస్‌బుక్‌లో తన భర్త ప్రణవ్ ముఖర్జీ ప్రొఫైల్‌ను చూసింది. తన భర్తకు అప్పటికే వివాహమైందని, ఓ కూతురు కూడా ఉందని తెలిసింది. దీంతో షాక్ గురైన బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పి, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

English summary
When 35-year-old Amrita (name changed) created a profile on a leading matrimonial website in 2013, she had hoped to find true love. She thought she had found the perfect match when she came across 46-year-old Pranav Mukherjee's profile, she being a school teacher and he the director of a Ghaziabad-based firm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X