వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శారదా చిట్ ఫండ్ కేసులో ఒడిశా మాజీ ఏజీ అరెస్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Former Advocate General of Odisha Held in Chit Fund Case
న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ కేసులో ఒడిశా మాజీ అడ్వకేట్ జనరల్ (ఏజీ) అశోక్ మహింతిని సిబీఐ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈయన గతంలో ఒడిశాలో అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. శారదా గ్రూపు కుంభకోణం కేసులో అశోక్ మహంతి ప్రమేయం ఉందని సిబీఐ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా అశోక్ మహంతి పని చేసిన సమయంలో శారదా చిట్ ఫండ్ గ్రూప్‌కు సంబంధించిన ఆర్త తత్వ గ్రూప్ అధిపతి ప్రదీప్ శెట్టి నుంచి కటక్‌లో ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఇక అశోక్ మహంతి అడ్వకేట్ జనరల్‌ ఇటీవలే రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమోదించారు.

కోల్ కతాలో తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్‌ఫండ్‌ స్కాంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించిన వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది. చిట్‌ఫండ్‌ కంపెనీతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 56 చోట్ల సోదాలు చేసి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేకుంది. ఈ చిట్టీల కుంభకోణానికి సంబంధించి ఒడిశాలోని చిట్‌ఫండ్‌ కంపెనీ డైరెక్టర్‌ సంబిత్‌ కుంతియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ నేతృత్వంలో ఈ స్పెషల్ టీం పనిచేస్తోంది. శారదా చిట్ ఫండ్ కంపెనీ గత ఏడాది ప్రజల నుంచి కోట్ల రూపాయలు పెట్టుబడులుగా సేకరించి బోర్డు తిప్పేయడంతో పలువురు ఇన్వెస్టర్లు, ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

English summary

 Former Odisha Advocate General Ashok Mohanty has been arrested by the CBI for his alleged role in a chit fund scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X