వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4ఏళ్ల బాలుడ్ని కుక్కల బోనులో బంధించిన ప్రిన్సిపాల్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: అభంశుభం తెలియని ఆ చిన్నారిని ఓ ప్రిన్సిపాల్ తన పైత్యంతో వింతైన శిక్ష విధించారు. యుకెజి చదువుతున్న బాలుడు క్లాసు రూములో తన తోటి పిల్లలతో మాట్లాడుతున్నాడని ఆగ్రహించిన ప్రిన్సిపాల్ ఆ బుడతడిని కుక్కల్ని ఉంచే ‘బోను'లో ఉంచి తాళం వేశారు. గత గురువారం కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులు స్థానికుల సహకారంతో పాఠశాల ముందు సోమవారం ధర్నాకు దిగారు. ఇలాంటి దారుణమైన శిక్ష విధించిన స్కూలు ప్రిన్సిపాల్‌కు తగిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. స్పందించిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
కుడ్నాపనక్కూరు ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలో బాలుడ్ని కుక్కల బోనులో పెట్టి తాళం వేయడాన్ని అదే స్కూల్లో చదువుతున్న బాలుడి అక్క గమనించి తల్లిదండ్రులకు తెలిపింది.

Four-Year-old Locked up in Dog Cage by Teacher As 'Punishment'

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూలు ప్రిన్సిపాల్‌ శశికళను అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని కుక్కల బోనులో ఉన్న కుక్కను బయటికి వదిలి అందులో తోసేసేందుకు సహకరించిన మరో టీచర్ దీపికను కూడా అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కె. మునీర్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని డిపిఐ అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ కూడా విచారణకు ఆదేశించారు.

English summary
A four-year-old child was locked up in a dog cage by his teacher at a private school in Thiruvananthapuram, allegedly as punishment for talking in class.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X