వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీకటి పడితే మహిళలు అదృశ్యమే: యుపిపై పారికర్

|
Google Oneindia TeluguNews

పనాజి: ఉత్తరప్రదేవ్ రాష్ట్రంలో మహిళల భద్రతపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ‘మా రాష్ట్రం గోవాలో అయితే ఎలాంటి భయం లేకుండా అర్ధరాత్రి కూడా అమ్మాయిలు తిరగొచ్చు. అదే ఉత్తరప్రదశ్ రాష్ట్రంలో అయితే మాత్రం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అమ్మాయిలు రోడ్డు మీదకు వస్తే చాలు.. మాయమైపోతారు' అని ఆయన అన్నారు.

గురువారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. గోవాలో శాంతి భద్రతలపై విపక్షాలు ఆందోళన చేస్తుండటంతో ఆయన సమాధానం ఇస్తూ ఈ విధంగా స్పందించారు.

Girls not safe on Uttar Pradesh roads after sunset: Goa CM Manohar Parrikar

కొన్ని రాష్ట్రాలు పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టి, తద్వారా గోవాకు వస్తున్న లక్షలాది మంది పర్యాటకులను తమ రాష్ట్రాలు ఆకర్షించేందుకు యత్నిస్తున్నట్లు మనోహర్ పారికర్ ఆరోపించారు.
ఓ పెద్ద న్యూస్ ఛానల్ కూడా పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టేందుకు పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

వాళ్లకు గోవా మీద ఏవో హక్కులు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని, అందుకే అసలా ఛానల్ చూడటమే మానేశానని చెప్పారు. మనం ఏ విషయన్నైనా రెండు రకాలుగా చూడొచ్చని చెప్పిన మనోహర్ పారికర్.. మనం స్వాతంత్ర్య సమరయోధుడిగా చూస్తున్న భగత్ సింగ్, బ్రిటీషు వారికి తీవ్రవాదిలా కనిపించాడని ఉదాహరించారు.

English summary
In potentially controversial remarks, Goa Chief Minister Manohar Parrikar on Thursday said girls would "disappear" if they walk on the roads in Uttar Pradesh in the evening and invoked legendary Bhagat Singh to justify foreign study trips by his cabinet colleagues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X