వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ భేటీ: టీ సర్వేపై మోడీ ఆరా, పవర్స్‌పై‌ స్పష్టత

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి సమగ్ర కుటుంబ సర్వే గురించి ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్ నరసింహన్‌ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలన తీరుపై కూడా మోడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ల్లీలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని గవర్నర్ నరసింహన్ కలిశారు. రెండు రాష్ట్రాల పరిస్థితిని ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పనితీరుపై మోదీకి గవర్నర్ నివేదిక అందజేసినట్లు తెలియవచ్చింది. సుమారు అరగంటపాటు ఈ భేటీ కొనసాగింది.

Governor Narasimhan meets Narendra Modi

ఉమ్మడి రాజధానిలో గవర్ర్ అధికారాలపై చర్చ మోడీతో గవర్నర్ మాట్లాడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌పై అధికారాలు నిర్వహించడంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రధానంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇటీవల తన సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశ అంశాలను మోడీకి నరసింహన్ వివరించారు.

కాగా, ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలోనే ఉంటాయని కేంద్ర హోంశాఖ శుక్రవారం మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టినట్లు ప్రకటించింది. అయితే రోజువారి పాలనలో గవర్నర్ జోక్యం ఉండబోదని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన పక్షంలో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటారని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది.

English summary
It is said that PM Narendra Modi has been informed about the Telangana intensive household survevy by governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X