వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ ఆధునిక చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. బిపిన్ చంద్ర 1928లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా వ్యాలీలో జన్మించారు. ఆయన 1983లో యుజిసి సభ్యునిగా పనిచేశారు. 2002 - 2014 మధ్య ఆయన నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరించారు.

రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్ర్యోద్యమంపై బిపిన్ చంద్రకు ఎనలేని పాండిత్యం ఉంది. మహాత్మా గాంధీపై ఆయన సాధికారత సాధించారు. గుర్గావ్‌లోని తన నివాసంలో ఆయన శనివారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు.

Historian Bipan Chandra dies at the age of 86

గత కొన్ని వారాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరుగుతాయి. కమ్యూనిస్టు అయిన బిపిన్ చంద్ర పుస్తకాలు విద్యాసంస్థల్లో ప్రామాణికమైన పాఠ్యగ్రంథాలుగా ఉన్నాయి.

ఆయన లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశారు.

English summary
Prominent Indian historian Bipan Chandra died today in his sleep at the age of 86, family members said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X