వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హానీ ట్రాప్ కేసు: పాక్ లింక్‌లున్నాయన్న ఆసిఫ్ అలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నయీబ్ సుబేదార్ పతన్ కుమార్ పోద్దార్ హానీ ట్రాప్ కేసులో రెండో నిందితుడు ఆసిఫ్ అలీ పాకిస్తాన్‌తో తనకు సంబంధాలున్నాయని అంగీకరించినట్లు సమాచారం. విచారణలో ఆసిఫ్ అలీ తన సంబంధాలను అంగీకరించినట్లు మీడియాలో బుధవారంనాడు కథనాలు వచ్చాయి. తాను పాకిస్తాన్ మహిళను వివాహమాడినట్లు, యేటా తాను పాకిస్తాన్‌ను సందర్శించినట్లు ఆసిఫ్ అలీ అంగీకరించినట్లు విచారణలో అంగీకరించాడని సమాచారం.

మీడియా కథనాల మేరకు - గత రెండేళ్లుగా ఆసిఫ్ అలీ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నట్లు, భారతదేశంలో ఆర్థిక లావాదేవీల గురించి వివరాలు అందిస్తున్నట్లు అతను అంగీకరించినట్లు చెబుతున్నారు. కరాచీలో నివసిస్తున్న తన భార్య, ఇద్దరు పిల్లల భద్రతపై ఆసిఫ్ అలీ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

Honey trap case: Spy confesses to Pakistan link

దర్యాప్తులో భాగంగా ప్రిజన్ ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాదు పోలీసులు అలీని మీరట్ నుంచి హైదరాబాద్ తీసుకుని వచ్చారు. ఆగస్టులో ఉత్తరప్రదేశ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోద్దార్‌ను వలలో వేసుకున్న మహిళా గూఢచారి తరఫున అలీ పొద్దార్ ఖాతాలో డబ్బులు జమ చేసేవాడని చెబుతున్నారు

భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించినందుకు తనకు 75 వేల రూపాయలు ముట్టినట్లు పొద్దార్ పోలీసు విచారణలో అంగీకరించాడు. డబ్బుల కోసం, ఫేస్‌బుక్‌లో నగ్న చిత్రాల కోసం పోద్దార్ మహిళా గూఢచారికి రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వచ్చారు. అలీ పోద్దార్ ఖాతాలో డబ్బులు జమ చేసినప్పటికీ వీరిద్దరి మధ్య పరిచయం లేదని అంటున్నారు.

అలీ 1986లో పెళ్లి చేసుకున్నాడని, అతనికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్న అలీకి నెలల తరబడిగా డబ్బులు అందుతూ వచ్చినట్లు చెబుతున్నారు.

English summary
Asif Ali, the second accused in the Naib Subedar Patan Kumar Poddar honey trap case, has confessed to his links with Pakistan during interrogation, according to the police, media reports say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X