వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో బాధితులు, వాకి టాకీతో అధికారి (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ ఇంకా తేరుకోలేదు. ఐతే వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను ఇప్పటివరకు 2.4 లక్షల మందిని సైన్యం, జాతీయ విపత్తు దళం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇందుకు గాను 80 వరకు సరుకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు సహాయక చర్యల్లో వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ బలగాలు 19 పునరావాస కేంద్రాలను నెలకొల్పాయి.

వర్షం కారణంగా రాష్ట్రంలో దాదాపు సుమారు 6వేల కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు "అసోచామ్" ప్రాథమికంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లోయలో వరద నీరు తగ్గడంతో చెత్తాచెదారం, అంటు వ్యాధులు హెచ్చిరిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అధికారులు వైద్య, పారామెడికల్ సిబ్బందిని రంగంలోకి దించి, సామూహిక రోగ నిరోధక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీ నుంచి 10 టన్నుల ఔషధాలు, ఇతర వైద్య, ఆరోగ్య సామాగ్రిని శ్రీనగర్‌‌కు చేర్చారు. గత 60 ఏళ్లలో ఇంతటి భయంకరమైన వరదలను తామెన్నడూ చూడలేదని అన్నారు. ప్రభుత్వానికి చెందిన ఉన్నాతధికారులు కూడా ఈ వరదల్లో చిక్కుకుపోయారని తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు రేయిబవళ్లు కష్టపడి.. వరద బాధితులను శ్రీనగర్‌ లోని సహాయ కేంద్రాలను చేరవేస్తున్నారు. ఇందు కోసం గాను ఇండియన్ ఎయిర్ ఫోన్స్ అధికారులు ఎసి 130జె హెర్కులస్ ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆదుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అందించిన సహకారం మరచిపోలేనిదని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తాము సంతోషంగా ఉన్నట్లు క్యాబినెట్ సమావేశం అనంతరం పై విధంగా స్పందించారు.

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీనగర్‌లో ఎయిర్ ట్రాఫిక్ అధికారుల పర్యవేక్షణలో వరద బాధితులను క్షేమంగా ల్యాండ్ చేస్తున్న ఎసి 130జె హెర్కులస్ ఎయిర్ క్రాఫ్ట్‌.

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీనగర్‌లో ఎయిర్ ట్రాఫిక్ అధికారుల మాటామంతీ. వరద బాధితులను సహాయక కేంద్రాలకు చేర్చడంలో వీరు కృషి అభినందనీయం.

ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీనగర్‌లో ఎసి 130జె హెర్కులస్ ఎయిర్ క్రాఫ్ట్ ను పరిశీలిస్తున్న ఎయిర్ ట్రాఫిక్ అధికారి.

 వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

శ్రీనగర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ లో అధికారులు బిజి బిజీగా పనుల్లో నిమగ్నమైన ఎయిర్ ట్రాఫిక్ అధికారులు.

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

జమ్మూ కాశ్మీర్ ఎరియా సీనియిర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్, ఎయిర్ కమొడోర్ సుశీల్ కుమార్ అక్కడి పరిస్దితిని ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఎస్ఎస్ సోమన్‌కు వివరిస్తున్న దృశ్యం.

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

వరదల నుండి రక్షించిన బాధితులను ఐఎఎప్ - 17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాప్ట్‌ ద్వారా న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. ఐఎఎప్ - 17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాప్ట్‌ లోపల దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు.

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

వరద బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నఎయిర్ ఫోర్స్ అధికారులు

ఐఎఎప్ - 17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాప్ట్‌ నుంచి బయటకు వస్తున్న వరద బాధితులు. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లోనిది ఈ దృశ్యం.

English summary
As weather conditions remain favourable in the flood-hit Jammu & Kashmir, Indian Air Force personnel work day-night to rescue affected people and provide them relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X