వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ టెక్కీ: సోలార్ పవర్ ఆటోతో బ్రిటన్‌కు యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

 Indian Techie Will Drive Solar-Powered Auto to Britain
హైదరాబాద్: ఓ భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాహస యాత్రకు పూనుకున్నాడు. తాను స్వయంగా తయారు చేసిన సోలార్ పవర్‌తో నడిచే ఆటో రిక్షాతో బ్రిటన్‌కు యాత్ర చేయనున్నాడు. ఇంధన ఆదాను, పర్యావరణ పరిరక్షణకు ఈ వాహనం ఉపయోగపడుతుందనే విషయం తెలియజేయడానికి ఈ యాత్రకు అతను పూనుకున్నాడు.

పది దేశాల మీదుగా పది వేల కిలోమీటర్ల మేర అతను యాత్ర సాగిస్తాడు. ఇది ప్రజా రవాణాకు బాగా ఉపయోగపడుతుందని ప్రపంచానికి చాటి చెప్పడమే తన ధ్యేయమని గ్రీన్ యాక్టివిస్టుగా మారిన టెక్కీ రాబెల్లి నవీన్ ఐఎఎన్ఎస్ ప్రతినిధితో అన్నాడు.

నిజానికి నవీన్ పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ నుంచి ఇరాన్ మీదుగా బ్రిటన్ చేరుకోవాలని అనుకున్నాడు. కానీ రెండు పొరుగుదేశాల వీసా అతనికి లభించలేదు. టర్కీ, బల్గేరియా, సెర్బియా, హంగేరి, ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల వీసా లభించిందని నవీన్ చెప్పాడు. ఇస్తాంబుల్, బెల్గ్రేడ్, జగ్రేబ్, బుడాపెస్టు, సల్జ్‌బర్గ్, మునిచ్‌ల మీదుగా టెహ్రాన్ నుంచి పారిస్ వెళ్తానని చెప్పాడు. మూడు నెలల్లో బ్రిటన్ చేరుకుంటాని చెప్పాడు.

హైదరాబాదులో దశాబ్దం క్రితం బిటెక్ పూర్తి చేసిన నవీన్ ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం మెల్బోర్న్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆస్ట్రేలియా పాస్‌పోర్టుతో ప్రపంచ యాత్ర చేయడం వల్ల సమస్యలు ఉండవనేది అతని భావన.

ముంబైకి చేరుకుని ఆ తర్వాత తన ఆటో రిక్షా తేజాస్ ఓడ ద్వారా ఇరాన్ చేరుకుంటాడు. అక్కడి నుంచి సోలార్ ఆటో యాత్ర ప్రారంభించి బ్రిటన్‌కు చేరుకుంటాడు. నవీన్‌తో పాటు ఆస్ట్రియా ఆటోమొబైల్ ఇంజనీర్, వీడియోగ్రాఫర్ రౌల్ కోపాక్కా ఆటో రిక్షాలో ప్రయాణం చేస్తాడు.

ఎనిమిది గంటలు ఎలక్ట్రకిల్ చార్జీ, ఐదు గంటలు సౌరశక్తితో చార్జీ చేస్తే 650 కిలోల బరువు గల ఆటో 105 కిలోమీటర్లు నడుస్తుందని నవీన్ చెప్పాడు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నాన్ స్టాప్‌గా నడుస్తుందని కూడా అంటున్నాడు. ఆటోకు సంబంధించి సోలార్ ప్యానెల్స్ మాత్రం అమెరికావని, మిగతా అంతా దేశీయమేనని చెప్పాడు.

English summary
An Indian techie will soon embark on a trans-national expedition riding on a self-built solar-powered autorickshaw to Britain to promote a sustainable low-cost alternative transport solution and check air pollution in towns and cities across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X