వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదల్లో 277 మంది మృతి, బిల్ గేట్స్ సాయం(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్నీర్‌లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 277మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. పది రోజుల పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వరదల వల్ల జమ్మూ ప్రాంతంలో 210 మంది మృత్యువాతపడ్డారని, కాశ్మీర్ ప్రాంతంలో 60 మందికి పైగా మరణించారని ఆయన అన్నారు.

1982 తర్వాత ఇంతటి భయంకర వరదలు తామెన్నడూ చూడలేదని ఆయన తెలిపారు. ఈ వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రోడ్లు, ప్రైవేటు ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టం ఊపించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉందన్నారు.

జమ్మూ కాశ్మీర్‌కు మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు రూ. 4.25 కోట్ల అత్యవసర ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకువచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అనంతరం పలువురు మంత్రులను కూడా కలిశారు. ఈ సమయంలోనే జమ్మూకు సాయం చేస్తామని ప్రకటన చేశారు.

శ్రీనగర్ - బారాముల్లా మార్గాల్లో రైళ్ల రాకపోకలను పాక్షికంగా పునరుద్దరించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను ఇప్పటి వరకు 2.4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ బలగాలు 19 పునరావాస కేంద్రాలను నెలకొల్పాయి.

వర్షం కారణంగా రాష్ట్రంలో దాదాపు సుమారు 6వేల కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు "అసోచామ్" ప్రాథమికంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆదుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అందించిన సహకారం మరచిపోలేనిదని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే.

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్నీర్‌లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 277మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

వరదల కారణంగా అమాంతం కూలిపోయిన ఇల్లు. పది రోజుల పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వరదల వల్ల జమ్మూ ప్రాంతంలో 210 మంది మృత్యువాతపడ్డారని, కాశ్మీర్ ప్రాంతంలో 60 మందికి పైగా మరణించారని ఆయన అన్నారు.

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

ఇంటిలోకి వచ్చిన వరదనీటిని బయటకు తోడేస్తున్న ఓ మహిళ. 1982 తర్వాత ఇంతటి భయంకర వరదలు తామెన్నడూ చూడలేదని ఆయన తెలిపారు.

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

ఏమైనా వస్తువులు మిగిలి ఉన్నాయోమో తీసుకుందాం. వరదల కారణంగా కూలిపోయిన తన ఇంట్లో పనికి వచ్చే వస్తువులను తీసుకుంటున్న వరద బాధితుడు.

 వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

వరదల్లో 277మంది చనిపోయారు: ఒమర్ అబ్దుల్లా

వరద నీటిలో మునిగిపోయిన టూవీలర్ బండిని చూసుకుంటున్న వరద బాధితుడు.

English summary
The floods that wreaked havoc in Jammu and Kashmir for over 10 days, turning out to be the worst ever flood of the century claimed 277 lives, said Chief Minister Omar Abdullah on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X