వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హింసించడానికే: జయ, కంట తడి పెట్టిన మంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: తనను హింసించడానికే తనపై కేసులు పెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడియంకె అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపతమైనవని ఆమె వ్యాఖ్యానించారు. శిక్ష ఎంత అనేది తేలిన తర్వాత హైకోర్టులో అపీల్ చేయాలని జయలలిత తరఫు న్యాయవాదులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, జయలలిత ఆస్తుల కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. తమిళనాడు ఆర్థిక మంత్రి పనీర్ సెల్వం కోర్టు హాలులో కంట తడి పెట్టారు. బెంగళూర్ చేరుకున్న జయలలిత అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

Jayalalithaa comments on case: minister sheds tears

జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు మధ్య బస్సుల రాకపోకలను నిలిపేశారు. సరిహద్దుల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జయలలితకు శిక్షను ఖరారు చేస్తారనే నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తాజా పరిణామాలపై డిఎంకె నేత కరుణానిధి నివాసంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. స్టాలిన్‌తో పాటు పలువురు నేతలు పార్టీపై వైఖరిపై చర్చిస్తున్నారు. తమిళనాడులోని పలు జిల్లాల్లో పాక్షికంగా బంద్ జరుగుతోంది. తమిళనాడు అంతటా బస్సులను నిలిపేశారు.

English summary
Tamil Nadu CM and AIDMK president Jayalalithaa said that cases are fabricated and to meant for harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X