వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లోనే జయలలిత: విచారణ 6వ తేదీకి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayalalithaa to remain in jail, bail plea hearing on Monday
బెంగళూర్: అన్నాడియంకె అధినేత వచ్చే నెల 6వ తేదీ వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జయలలిత దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌పై విచారణను కర్ణాటక హైకోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు వాయిదా వేసింది. జయలలిత ప్రస్తుతం బెంగళూర్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

జయలలిత పిటిషన్లు ముందుకు రాగానే - హైకోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ అపీల్స్ విషయంలో తనను ఎస్‌పిపిగా నియమిస్తూ ఏ విధమైన అధికారిక నోటిఫికేషన్ కూడా రాలేదని అదాయానికి మించి ఆస్తుల కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన జి. భవానీ సింగ్ చెప్పారు. తనకు గడువు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.

వెంటనే తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జయలలిత ఓ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు కింది కోర్టు తనను దోషిగా నిర్ధారించడాన్ని కూడా సవాల్ చేశారు. పలు తీర్పులను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని, ఆదాయం పన్ను ట్రిబ్యునల్ ఆదాయం పన్నుకు సంబంధించిన ఆదేశాలనూ నిర్ణయాలనూ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని జయలలిత తన పిటిషన్‌లో అన్నారు.

ఇదిలావుంటే, జయలలిత బెయిల్ పిటిషన్‌పై రేపు బుధవారం విచారణ అవకాశం ఉన్నట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. ప్రత్యేత ధర్మాసనం జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపవచ్చునని సమాచారం.

ఆదాయనికి మించి ఆస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇలవరసలను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

English summary
AIADMK supremo J Jayalalithaa will have to remain in jail till October 6 with the Karnataka High Court adjourning her plea seeking bail and challenging her conviction in the disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X