వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్గిల్: నాటి అనుభవం భయానకమన్న యువకులు

|
Google Oneindia TeluguNews

ద్రాస్(జమ్మూకాశ్మీర్): పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధం జరిగి 15ఏళ్ల అవుతుంది. యుద్ధ సమయంలో అక్కడే వున్న ఓ బాలుడు ఇప్పుడు యువకుడు అయ్యాడు. ఆ సమయంలో తను ఎదుర్కొన్న సంఘర్షణ గురించి ఆయన వన్ ఇండియాతో పంచుకున్నారు. 1999 వేసవి(మే-జులై)లో కార్గిల్ యుద్ధం జరిగింది.

‘ఆ రోజు స్కూల్ మూసేశారు'

వన్ ఇండియా మొదటి సారిగా జకీర్‌ను కలిసింది. ఆయన మాట్లాడుతూ..‘1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో మేమంతా పాఠశాలలో ఉన్నాం. అప్పుడు నాకు 15ఏళ్లు. అది మధ్యాహ్న సమయం. సహచరులతో కలిసి భోజనం ముగించాం. అంతే హఠాత్తుగా పెద్ధ పేలుడు శబ్ధం వినిపించింది.' అని చెప్పాడు.

Kargil Special: 'I kept on running in fear till an army jawan stopped me'

‘ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాం. అయితే అల్లర్లు చెలరేగాయని మమ్మల్ని టీచర్ ఇంటికి వెళ్లామన్నారు. అప్పుడు మాకు తెలియదు అది ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధమని. రాత్రి వరకు బాంబు పేలుళ్లు, తూటాల శబ్ధాలు వినిపించాయి. అదొక భయానక రాత్రి. మన సైన్యం మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది' అని పేర్కొన్నాడు జకీర్.

‘నాకు తీవ్రంగా భయం వేసి పరుగెత్తాను'

గులాం కదీర్, టైగర్ హిల్స్‌లోని తలోలింగ్ వాసి. ఈ ప్రాంతానికి దగ్గరలోనే యుద్ధం కొనసాగింది. అప్పుడు అతని వయసు ఏడేళ్లు. ప్రస్తుతం అతనికి 22ఏళ్లు. అతని లక్ష్యం ఐఏఎస్. యుద్ధం జరిగిన ఆ రోజుల్లో తాను తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెప్పాడు.

‘నేను మా ఇంటిని వదిలి బయటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఓ సైనికుడు ఆపి ఇక్కడ దాడులు జరుగుతున్నాయని చెప్పి, పరుగెత్తొద్దని, ఇంటికెళ్లాలని మందలించాడు. నేను తిరిగి ఇంటికెళ్లాను. నన్ను ఆందోళనకర స్థితిలో చూసిన మా అమ్మ షాక్‌కు గురైంది. ఆ రోజులను ఇప్పుడు తలచుకున్నా నేను నిద్రపోలేను' అని కదీర్ చెప్పాడు.

1999లో జరిగిన యుద్ధ జ్ఞాపకాలను జకీర్, కదీర్‌లకే కాదు చాలా మంది ప్రజలకు దు:ఖాన్ని కలిగించాయి. యుద్ధ సమయంలో తుపాకీ గుళ్ల, బాంబు పేలుళ్ల శబ్ధాలు, ఆర్థనాదాలు విన్న ఎవరూ కూడా మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు. కాగా, కార్గిల్ విజయానికి 15ఏళ్లయిన సందర్భంగా జమ్మూకాశ్మీర్ తోపాటు భారతదేశమంతటా విజయోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

English summary
They were teenagers when the last armed conflict between India and Pakistan took place 15 years ago. The memory of the younger days is still fresh in their minds. Oneindia spoke to them to relive their experience during the Kargil conflict in the summer of 1999.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X