వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవం. 2న ప్రేమికులు ముద్దులు, కౌగిలింతలతో నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మోరల్ పోలీసింగ్ పేరుతో గతవారం కేరళలోని కోజికోడ్ రెస్టారెంటులో యువమోర్చా కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా కోచి మెరైన్ డ్రైవ్ వద్ద యువతీ, యువకులు భారీ ఎత్తున నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 2వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ప్రేమజంటలు బహిరంగంగా ముద్దులు, కౌగిలింతలు పెట్టుకొని నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కిస్ ఆఫ్ లవ్ అని పేరు పెట్టారు.

అక్టోబర్ 23న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, కోజికోడ్‌లోని ఓ రెస్టారెంట్ పైన యువ మోర్చా కార్యకర్తలు అక్కడున్న ప్రేమికులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శిక్షించడానికి మీకే అధికారముందంటూ పోలీసులు యువ మోర్చా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

'Kiss of Love' in Kochi on November 2

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేమికులు నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రేమికులు కూడా తమతో కలసి రావాలని వారు కోరారు. ఇందుకోసం రాహుల్ పశుపన్ అనే షార్ట్ ఫిలిమ్ మేకర్ ఓ ఫేస్‌బుక్ పేజీని కూడా ప్రారంభించాడు. ఈ పేజీకి కిస్ ఆఫ్ లవ్ అని పేరు పెట్టాడు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచే వారు సాయంత్రం ఐదు గంటలకు రావాలని కోరుతున్నారు. అలాగే, కార్యక్రమంలో పాలుపంచుకునే వారు కిస్ ఆఫ్ లవ్ అని రాసి ప్లకార్డును పట్టుకు రావాలని సూచిస్తున్నారు. వచ్చిన వారు తమ భాగస్వామిని ముద్దు పెట్టుకోవచ్చు లేదా హగ్ చేసుకోవచ్చునని చెబుతున్నారు.

గత నెల రాహుల్, అతని స్నేహితులు 'ఫ్రీ హగ్స్' కార్యక్రమాన్ని తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. ఇదే తరహా కార్యక్రమాన్ని కోజికోడ్‌లో నవంబర్ 1న కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ ఫేస్‌బుక్ పేజీకీ మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు.

స్నేహితులు, తెలియని వారు, తెలిసిన వారు అందరూ... మోరల్ పోలీసింగును వ్యతిరేకిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సెలబ్రేషన్స్ మరిన్ని చేస్తామని ఫేస్‌బుక్ పేజీని తయారు చేసిన రాహుల్ చెబుతున్నారు. ఫేస్‌బుక్ పేజీ లాంచ్ చేసిన గంటలోనే 700కు పైగా లైక్స్ వచ్చాయంటున్నారు.

English summary
Social media has been abuzz ever since Yuva Morcha volunteers attacked a cafe in Kozhikode alleging that it facilitated immoral activities among students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X