వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ ఫోన్ కోసం హత్య చేసిన పదోతరగతి బాలుడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Kolar police chased a murder case in Bangarpet
కోలారు: ప్రస్తుతం మనుషులు అన్నం తినకుండానైనా ఉండగలరు కానీ సెల్ ఫోన్ వాడకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. అలాంటి సెల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం పదోతరగతి బాలుడు హత్య చేశాడు. వివారాల్లోకి వెళితే... కోలారు జిల్లాలోని బంగారు పేట పట్టణంలో ఈనెల 11న సంచలనం సృష్టించిన మంజుల అనే వివాహిత హత్య కేసుని పోలీసులు ఛేదించారు.

టచ్ స్క్రీన్ సెల్ ఫోన్ కొనుక్కోవడానికి డబ్బు అవసరం అవడంతో పాటు బాలుడు హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడని నిర్దారించిన పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు కోలారు గోల్డ్ ఫ్యాక్టరీ ఎస్పీ భగవన్‌దాస్ వివరాలు తెలిపారు. బంగారుపేట పట్టణంలోని విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న బాలుడు ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. చనిపోయిన మంజుల ఇంటికి ఎదురుగుండానే బాలుడి కుటుంబం నివాసం ఉండేది.

ఇంటికి ఎదురుగా నివసించడంతో బాలుడుతో మంజులకి పరిచయం ఏర్పడింది. ఎవరూ లేని సమయం చూసుకోని బాలుడు మంచినీరు కావాలని అడగడంతో ఆమె లోపలికి వెళ్లింది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న బాలుడు ఇదే అదను అనుకోని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దగ్గరలో ఉన్న కర్రను తీసుకోని బాలుడిపై ప్రతిఘటించినా.. బాలుడి ఆమె నోటిని అదిమిపెట్టి బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు.

ఆ తర్వాత బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలుతో పారిపోయాడు. రక్తంతో తడిచిన చేతులతో ఇంట్లో నుండి వచ్చిన బాలుడ్ని చూసిన స్దానికులు ఏమైందని అడగ్గా, బైక్‌పై క్రింద పడ్డాడని వారికి అబద్దం చెప్పాడు. ఆ తర్వాత బాలుడు హొసకోటకు వెళ్లి, ఐదు రోజుల తర్వాత సేలంలోని తన మిత్రుల వద్దకు చేరుకున్నాడు.

కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాలుడి కోసం గాలించగా సేలంలో ఉన్నాడని తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. టచ్ స్క్రీన్ సెల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బుకోసమే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలుడు విచారణలో అంగీకరించాడని కోలారు గోల్డ్ ఫ్యాక్టరీ ఎస్పీ తెలిపారు.

English summary

 
 Kolar police chased a murder case in Bangarpet. In Kolar district tenth class student done a murder lady for a cell phone buying purpose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X