వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైక్‌తో పాటు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు (ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీగా కురిసిన వర్షాలకు ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నిండుగా ప్రవహిస్తున్న నది రోడ్డు పై నుండి ప్రవహిస్తోంది. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంది. అయితే, అది అంత లోతుగా లేదు. దీంతో అవతలి పక్కకు వెళ్లేందుకు.. ద్విచక్ర వాహనం పైన వచ్చిన ఓ యువకుడు ప్రయత్నించాడు.

అతను బైక్ మీద నది పారుతున్న ఆ రోడ్డు మీదుగా కొంత దూరం వెళ్లాడు. అయితే, అనుకోని విధంగా ప్రవాహం మరింత వేగంగా వచ్చింది. దీంతో అతను ద్విచక్ర వాహనంతో సహా వాగులో కొట్టుకుపోయాడు. అందరు చూస్తుండగానే కళ్లముందే అతను మాయమైపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బైతుల్ జిల్లాలో జరిగింది.

Man drown in floods with bike

పట్టుబడ్డ వ్యక్తి

తమిళనాడులోని పుదుకొట్టాయ్ గ్రామానికి చెందిన ఫైరోజ్ ఖాన్ అనే వ్యక్తి సింగపూర్ విమానాశ్రయాధికారులను మభ్యపెట్టి ఆరు కేజీల బంగారంతో చెన్నై చేరుకున్నాడు.

బంగారం అక్రమ రవాణాపై భారత కస్టమ్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో అతను చెన్నైలో పట్టుబడ్డాడు. బిస్కెట్ల రూపంలో ఆ బంగారం విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని చెన్నై విమానాశ్రయాధికారులు తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారంపై విచారణ చేస్తున్నారు.

English summary
Man drown in floods with bike in Madhya Pradesh on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X