వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: కూతురుపై లైంగిక దాడి, నిందితుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Man held for sexually assaulting daughter in Mumbai
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోని దహిసర్ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కన్న కూతురుపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక మరో ఇద్దరు తన తోబుట్టువులతోపాటు తన తండ్రి వద్ద ఉంటోంది. గత ఏడేళ్లుగా నిందితుడి నుంచి అతని భార్య వేరుగా ఉంటోంది.

కాగా, ఫుట్‌పాత్ పైనే జీవనం సాగిస్తున్న నిందితుడు అతని పెద్ద కుమార్తె(10)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక 2013, డిసెంబర్‌లో అక్కడ్నుంచి పారిపోయింది. కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో బాధిత బాలికను గుర్తించిన రైల్వే పోలీసులు, ఆమెను డోంగ్రీలోని బాలికల వసతి గృహానికి తరలించారు.
అప్పట్నుంచి బాలిక అక్కడే నివాసం ఉంటోంది.

తనపై తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత బాలిక ఏప్రిల్ 15న వసతి గృహం నిర్వాహకులకు తెలిపింది. బాలిక వాదనను రికార్డు చేసిన వసతి గృహ నిర్వాహకులు పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపిసి 376, 354 (డి) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.

English summary
A 34-year-old ragpicker was arrested by the Dahisar police on Thursday morning for sexually assaulting his daughter. The 10-year-old victim lived on the footpath with her father and two younger siblings. Her mother had separated from her father seven years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X