వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై అత్యాచారం, వెబ్‌లో వీడియో అప్‌లోడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో కీచక సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మహిళపై అత్యాచారం చేసి, దాన్ని చిత్రీకిరించి, వీడియోను వెబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ సంఘటన సవాయయిమాధోపూర్ జిల్లాలో జరిగినట్లు పోలీసులు బుధవారంనాడు చెప్పారు.

నిందితుడిని ఆసిఫ్‌గా గుర్తించారు. అత్యాచార సంఘటనను చిత్రీకరించి వీడియోను కొద్ది కాలం క్రితం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పెట్టాడు. దాంతో బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసిఫ్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, కానీ 2009లో తనపై అత్యాచారం చేశాడని 23 ఏళ్ల యువతి ఆరోపించింది.

Man Rapes Woman, Uploads Video On Web

తనకు తెలియకుండా అత్యాచార ఘటనను చిత్రీకరించాడని, దాన్ని కొద్ది రోజుల క్రితం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అప్‌లోడ్ చేశాడని సర్కిల్ ఆఫిసర్ రాకేష్ బైర్వా చెప్పారు. రెండు నెలల క్రితం ఆ మహిళకు మరో వ్క్తితో వివాహమైంది.

నిందితుడిని సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. తన దుకాణంలో ఉండగా ఆసిఫ్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

English summary
A woman has allegedly been raped by a man on the pretext of marrying her, in Sawaimadhopur district, police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X