వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: సిగరెట్ తాగాడని కత్తితో పొడిచి హత్య చేశాడు

|
Google Oneindia TeluguNews

Man stabbed in Nangloi for smoking
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన జరిగింది. సిగరెట్ తాగిన వ్యక్తి(30) తనపైకి పొగ వదిలాడనే నెపంతో ఓ వ్యక్తి అతడ్ని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్ ఆవరణలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బాధితుడు మెట్రో స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఓ షాపు వద్ద సిగరేట్ వెలిగించాడు. ఆ తర్వాత అతడు సిగరెట్ పొగను తన వైపు వదిలాడని నిందితుడు జాహీద్(26) పోలీసులకు చెప్పాడు.

తనకు సిగరెట్ పొగ పడదని చెప్పిన జాహిద్.. అతడితో గొడవకు దిగాడు. గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన జాహీద్ తన వద్ద ఉన్న కత్తితో విచక్షణా రహితంగా అతడ్ని పొడిచాడు. కాగా, అటువైపు వస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంబడించిన పోలీసులు జాహీద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధిత వ్యక్తిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. దీంతో హత్యా నేరం కింద జాహీద్‌పై కేసు నమోదు చేశారు.

English summary
A 30-year-old man was stabbed six times by a stranger after he smoked out a few puffs on his face. The brazen murder took place outside Nangloi metro station in west Delhi on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X