వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహనే ‘సూపర్ పిఎం’: ప్రియాంక, కదిలించిందని..

|
Google Oneindia TeluguNews

Priyanka Gandhi
అమేథి: ప్రధాని కార్యాలయం మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు తన పుస్తకంలో వెల్లడించిన అంశాలతో ప్రధాని మన్మోహన్ సింగ్‌పై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. యూపిఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఓ సూపర్ పిఎం అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అమేథీ లోకసభ అభ్యర్థి రాహుల్ గాంధీ తరపున శనివారం ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మన్మోహన్ సింగ్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ ఖండించారు.

వివిధ టెలివిజన్ ఛానళ్ల ద్వారా సోమవారం సోనియా గాంధీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తి హృదయాన్ని కదిలించేదిగా ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు. ప్రజలను విభజించే శక్తులను ఎన్నుకోవద్దని ఆ సందేశంలో సోనియా పేర్కొన్నారు. కాగా, సోనియా ప్రసంగం అంతా నటన అని, వీడ్కోలు ప్రసంగంలా ఉందని భారతీయ జనతా పార్టీ దుయ్యబట్టింది.

సంజయ్ బారు తన పుస్తకంలో మన్మోహన్ సింగ్ ఓ రబ్బరు స్టాప్ అని, రిమోట్ కంట్రోల్ సోనియా చేతిలో ఉందని తన పుస్తకంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేగాక మన్మోహన్ సింగ్‌ని అక్సిడెంటల్ పిఎం అని, సోనియా గాంధీని సూపర్ పిఎం అని వ్యాఖ్యానించారు.

English summary
Priyanka Gandhi on Tuesday said that only Manmohan Singh was the "super Prime Minister" in UPA government, amid a storm over Sanjaya Baru's tell-all book that raised questions over the political authority of the Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X