వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నీగ్రో': అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం, 2 అర్థాలని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పారు. నీగ్రో అన్న పదం వాడినందుకు ఆయన అసెంబ్లీకి క్షమాపణ తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల అదుపులో ఉన్న విదేశీయుల వివరాలను సభకు వెల్లడిస్తూ.. ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని కలాంగుటే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

 Manohar Parrikar says sorry in Goa Assembly

దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నీగ్రో అన్న పదం జాతి వివక్ష కిందికి వస్తుందని మండిపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ... ఇలాంటి పదాల వాడకంతో విదేశీ యాత్రికులకు ప్రతికూల సందేశాలు వెళతాయంది.

దీనిపై సీఎం పారికర్ వివరణ ఇస్తూ.. ఇది పోలీస్ డిపార్ట్‌మెంటు తప్పిదమని, ఆ విభాగంలోని ఓ క్లర్కు సదరు ఫైల్లో నీగ్రో అని పేర్కొన్నాడని తెలిపారు. నీగ్రో పేరిట అమెజాన్ ప్రాంతంలో ఓ ఉపనది ఉందని, మరో అర్థంలో చూసుకుంటే జాతి వివక్ష భావం కనిపిస్తుందని వివరించారు. తాను ఆ పదం వాడడం పట్ల ఎవరైనా బాధపడి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని చెప్పారు.

English summary
Goa Chief Minister Manohar Parrikar apologised on Thursday for using the word "N****" in one of the answers tabled on the floor of the House here after the alleged racist slur evoked strong reactions from the members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X