వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాయిలెట్స్‌ను ఆలయాలుగా, కారణం: నితిన్ గడ్కరీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యత లేని కారణంగా నివాసాల్లో టాయిలెట్లను ఆలయాలుగానూ, గోడౌన్లుగాను రూపాంతరం చెందాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా టాయిలెట్లను ఉపయోగించుకోలేక పోతున్నారని తెలిపారు.

తాగునీరు, శానిటేషన్ అంశాలపై నిర్వహించిన సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ మహాత్మగాంధీ 150 జన్మదినోత్సవం నాటికి అంటే 2019లో క్లీన్‌ ఇండియా అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కేవలం టాయిలెట్లను నిర్మిస్తే సరిపోదని ఆయన అన్నారు.

 Many toilets converted into temples, says Nitin Gadkari

దేశంలో మూడు లక్షల టాయిలెట్లను నిర్మిస్తే అందులో కేవలం పదివేల సంఖ్యలో మాత్రమే ప్రజలు ఉపయోగిస్తున్నారని వివరించారు. ప్రతి ఇంటికి టాయిలెట్‌తో పాటు నీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. "టాయిలెట్ పునాదులపై ఆలయాలు నిర్మించడం చూసి ఆశ్చర్యపోయాను. అందుకు కారణం నీటికొరతే. నీటి సరఫరా లేకుండా టాయిలెట్లు నిర్మించి ఉపయోగం లేదు" అని తెలిపారు.

ఇక దేశవ్యాప్తంగా జలరవాణాను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా రాయితీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. షిప్పింగ్ ఇండస్ట్రీస్‌ను ప్రోత్సహించి జలరవాణాలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామన్నారు. జలరవాణాతో ఖర్చు తగ్గడంతోపాటు, కాలుష్యం కూడా ఉండదని, ప్రమాదాలు తగ్గుతాయని, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని వివరించారు.

జీడీపీలో తమ శాఖ ద్వారా రెండు శాతం ఆదాయాన్ని సమకూర్చాలన్నదే తమ ధ్యేయమన్నారు. వాటర్ బాడీలను నీటి నిర్వహణ బోర్డులుగా మార్చే పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ముంబై పోర్టును అభివృద్ధి చేసేందుకు రూ. 4 వేల కోట్లతో అంచానాలు సిద్ధం చేశామన్నారు.

English summary
Nitin Gadkari, who also holds the portfolio of Drinking Water and Sanitation, said that mere construction of toilets will not be enough to achieve the government's goal of a clean India by 2019 -- the 150th birth anniversary of Mahatma Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X