హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లౌడ్ సేవలు: సత్య నాదెళ్ల, స్మృతి ఇరానీతో.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మంగళవారం అన్నారు. భారత్‌లో క్లౌడ్ సేవలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో క్లౌడ్ సేవలు వినియోగించాలని సూచించారు.

క్లౌడ్ సేవల ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ సేవలు అందుతాయన్నారు. ఆరోగ్య రంగం వంటి చోట క్లౌడ్ సేవలు వినియోగించుకోవాలన్నారు. క్లౌడ్ సేవల వినియోగం ద్వారా ఉత్పాదకత మరింత పెరుగుతుందన్నారు. క్లౌడ్ సేవలు వినియోగించడం వల్ల సమగ్ర ప్రక్షాళన జరుగుతుందన్నారు.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, తన క్లౌడ్ డేటా సెంటర్‌ను భారత్ లో ఏర్పాటు చేయనుంది. సత్య నాదెళ్ల ప్రకటించారు. 2015 నాటికి ఈ సెంటర్ ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. దీనిని 2 ట్రిలియన్ ఆపర్చునిటీస్‌గా అభివర్ణించారు. భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల

మైక్రో‌సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మంగళవారం నాడు భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న దృశ్యం.

సత్య నాదెళ్ల - స్మృతి ఇరానీ

సత్య నాదెళ్ల - స్మృతి ఇరానీ

మైక్రో‌సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మైక్రోసాఫ్ట్ భారత చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్‌లు ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో...

సత్య నాదెళ్ల - స్మృతి ఇరానీ

సత్య నాదెళ్ల - స్మృతి ఇరానీ

మైక్రో‌సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మైక్రోసాఫ్ట్ భారత చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్‌లు ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో...

సత్య నాదెళ్ల - స్మృతి ఇరానీ

సత్య నాదెళ్ల - స్మృతి ఇరానీ

మైక్రో‌సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...

భారత ప్రభుత్వంతో పాటు కార్పొరేట్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేసేందుకు మైక్రోసాఫ్ట్ కృతనిశ్చయంతో ఉందన్నారు. 25 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇప్పటిదాకా క్లౌడ్ సేవల రంగంలోని మైక్రోసాఫ్ట్‌తో పాటు గూగుల్, అమెజాన్‌లు తమ డేటా కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 13, గూగుల్‌కు 12, అమెజాన్‌కు 8 డేటా సెంటర్లున్నాయి. తాజాగా భారత్‌లో క్లౌడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

English summary
Microsoft CEO Satya Nadella addresses in New Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X