వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మామ్' టెస్ట్ ఫైరింగ్ విజయవంతం, తగ్గిన వేగం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: అంగారక ప్రభావ ప్రాంతం కక్ష్యలోకి 'మామ్' ప్రవేశించింది. మధ్యాహ్నాం 2.30గంటలకు మామ్‌‌కు ఇస్రో మార్గ సవరణ ప్రక్రియ చేపట్టింది. ఈ సవరణ ప్రక్రియ విజయవంతం అయినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 300 రోజులుగా నిద్రాణంలో ఉన్న ప్రధాన ఇంజన్‌ను ఇస్రో క్రియాశీలం చేసింది.

మామ్ వేగాన్ని 22.1 కిమీ నుంచి 4.4 కిమీ తగ్గించిన ఇస్రో పేర్కొంది. ఈ ఇంజిన్ పనిచేయడం మొదలుపెడితే, ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ రెండు రోజుల పాటు ప్రయాణించే మామ్ బుధవారం అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

 Mission Mangalyaan: Indian spacecraft enters Martian sphere of influence

కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కోసం దీన్ని 3.968 సెనక్ల పాటు మండించారు. ఇందుకోసం 0.567 కిలోల ఇంధనాన్ని ఉపోయోగించుకుంటుంది. ఇప్పటికే మూడు పథ సవరణ విన్యాసాలను దిగ్విజయంగా పూర్తి చేసిన ఇస్రో, సోమవారం నాలుగో పథ సవరణ విన్యాసానికి సర్వం సిద్ధం చేసింది.

మార్స్ ఆర్బిటర్ మిషన్ గత ఏడాది నవంబర్ 5న పీఎస్ఎల్‌వీ రాకెట్ ద్వారా నెల్లూరు శ్రీహరి కోట నుంచి విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధి నుంచి బయటకు వెళ్లిపోయింది.

రూ. 450 కోట్లతో చేపట్టిన ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు సక్కెస్ ఐతే నాసా (అమెరికా), ఐరోపా అంతరిక్ష సంస్ద, రోస్ కాస్మోస్ (రష్యా) తర్వాత అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన సంస్దగా ఇస్రో అవతరిస్తుంది.

English summary

 India's spacecraft Monday entered the Martian sphere of influence on way to the red planet's orbit early Wednesday, while cruising in the sun's orbit.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X