వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిపై దాడి.. సజీవ దహనం చేసేందుకు యత్నం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Mob tries to burn Bihar minister alive
న్యూఢిల్లీ: బీహార్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర మంత్రికి ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. బీహార్ లోని ససారం జిల్లాలో రోహతాస్ ప్రాంతంలో తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాక మంత్రి వినయ్ బిహారీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే ఏర్పాట్లు సరిగా లేవంటూ కొందరు స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదికపైకి కుర్చీలను విసిరేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన స్థానికులు వేదికపై విరుచుకుపడ్డారు.

ససారంలో ప్రభుత్వ అధికారులపై దాడి చేయడంతో పాటు, మంత్రిని కూడా సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. మంత్రి అధికార వాహనంపై స్థానికులు పెట్రోల్ పోసి, నిప్పు పెట్టారు. ఆయనపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.

స్థానికులు దాడి జరుపుతున్న సమయంలో రోహ్ తక్ జిల్లా ఎస్పీ కూడా అక్కడే ఉండట గమనార్హం. మంగళవారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన మంత్రి, తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందంటూ ఆరోపించారు.

విచక్షణ కోల్పోయిన యువకులు, కిరోసిన్ బాటిళ్లు చేతబట్టి, తనకోసం గాలించడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు. దీనిపై 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

English summary
An abortive attempt was made to burn alive a Bihar cabinet minister in the presence of district officials, including the DM and SP of Rohtas, at Sasaram, 150km from Patna, on late Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X