వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలా చేస్తారు, దిగనంటే దిగను!: నగ్మాకు కోపమొచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి నగ్మాకు మరోసారి కోపమొచ్చింది. తనకు చెప్పకుండా తన కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేయడం నగ్మాకు కోపం తెప్పించింది. రెండు రోజుల క్రితం నగ్మా బరేలీ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రీణ్ సింగ్ ఆరోన్ తరఫున ప్రచారం కోసం బరేలీకి వచ్చారు.

ఈ సమయంలో ఆమె ప్రచార కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేదు. బరేలీలోని ఓ కళాశాలలో నగ్మా హెలికాప్టర్ దిగింది. అప్పుడు నాయకులు ప్రోగ్రామ్ మార్పు గురించి చెప్పారు.

నగ్మా అక్కడ ఇరవై నిమిషాల పాటు సభలో మాట్లాడాల్సి ఉంది. అయితే, కార్యకర్తలు దానిని మార్చి రోడ్డు షో నిర్వహించాలని చూశారు. ఇది తెలుసుకున్న నగ్మాకు కోపం వచ్చింది. హెలికాప్టర్ నుండి దిగేందుకు ఆమె ససేమీరా అన్నారు.

 Nagma’s roadshow in Bareilly ends in fiasco

స్థానిక నాయకులు బతిమాలి ఆమెతో ఏదో నాలుగు మాటలు మీడియాతో మాట్లాడిపించారు. నగ్మా రోడ్డు షో ఉంటుందని భారీ ఎత్తున జనం రోడ్డు కిరువైపులా నిలబడ్డారు. తీరా ఆమె రాకపోయేసరికి జనం అసంతృప్తికి గురయ్యారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ప్రజలకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

స్థానిక నేతల బతిమాలడంతో కొంత కూల్ అయిన నగ్మా కేవలం మీడియాతోనే నాలుగు మాటలు మాట్లాడారు. తనకు రోడ్డు షోకు సమయం లేదని, మరో అరగంటలో మరో పట్టణంలో ముప్పై నిమిషాల సభ ఉందని చెప్పి అక్కడి నుండి హెలికాప్టర్లో వెళ్లిపోయారు. నగ్మా తీరుతో స్థానిక కాంగ్రెసు క్యాడర్ అసంతృప్తికి గురయింది.

మీడియాతో మాట్లాడిన నగ్మా మోడీ పైన మండిపడ్డారు. నిజంగానే మోడీ హవా ఉంటే ఆయన సురక్షిత వారణాసి నుండి కాకుండా మరోచోట నుండి ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని కావడం ఖాయమన్నారు.

English summary
Congress candidate from Meerut who arrived here to conduct a roadshow on behalf of party candidate Pravin Singh Aron on Monday virtually ended up cancelling her programme and left after speaking to the media only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X