వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ జన్ ధన్ యోజన: తోలిరోజే కోటిన్నర ఖాతాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జన్ ధన్ యోజన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా జన్ ధన్ యోజన పథకం క్రింద తొలిరోజే కోటి ఖాతాలు ప్రారంఛిందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభంలో పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

జన్ ధన్ యోజన పథకం యొక్క లక్ష్యాలను వివరిస్తూ బ్యాంక్ అధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా 7.25 లక్షల మెయిల్స్ పంపారు. ఆ ఆధార్ అనుసంధాన ఖాతాలకు రూ. 5వేలు ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం , పేదలకు డెబిట్ కార్డు, రూ. లక్ష భీమా సౌకర్యం కల్పిస్తారు. దేశ వ్యాప్తంగా 76 కేంద్రాల్లో జన్ ధన్ యోజన కార్యక్రమం ప్రారంభమైంది.

Narendra Modi launches Jan Dhan Yojana

ప్రస్తుత సమాజంలో ఆర్దిక ఆస్పృశ్యత ఉందని.. దీని నుండి పేదలకు విముక్తి కలిగించాల్సి అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అందరికీ బ్యాంక్‌ ఖాతా లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేదలు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారని, పేదల కష్టాలకు అప్పులే కారణమని నరేంద్ర మోడీ అన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం పేదరిక నిర్మూళన కోసమేనని నరేంద్రమోడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామరాజన్‌, ఆంద్రప్రదేశ్ తరఫున ఎంపీ కంభంపాటి, పలువురు బ్యాంక్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పేదల జీవితాల్లో మార్పు: చంద్రబాబు నాయుడు

పేదవారి జీవితాల్లో మార్పు తీసుకోచ్చే పథకం ఇదని, నా ఖాతా.. నా భాగ్యవిధాత అన్న విధానం పేదవాడి కలలను నేరవేరుస్తుందని ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన రాజమండ్రిలో జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు.

దేశమంతా ఈ కార్యక్రమం ఒకేసారి ప్రారంభమవడం చాలా గర్వంగా ఉందని, ఆరు నెలల తర్వాత ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఎవరైతే బ్యాంక్‌కి పోలేరో వారికి మిత్ర సేవలు లభిస్తాయన్నారు. తెలుగు అక్షరం, తెలుగు నుడికారాలకు పుట్టిల్లైన రాజమండ్రిలో ఈ కార్యక్రమం ప్రారంభిచండం చాలా సంతోషంగా ఉందన్నారు.

జన్ ధన్ యోజన పథకం ముఖ్యాంశాలు

* జాతీయ సమగ్రత కోసమే ఈ పథకానికి జన్ ధన్ యోజన పేరు

* దేశంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనేది లక్ష్యం

* స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్లయినా అందరికీ బ్యాంక్ సౌకర్యం లేకపోవడం బాధాకరం

* ప్రజల్లో నమ్మకం నింపడమే మా పరిపాలన లక్ష్యం

* అన్ని రాష్టాల ముఖ్యమంత్రులను ఏకం చేసి పథకం ఒకేసారి అమలు చేయడం

* ఈ అనుభవం వల్ల ఎన్నో కొత్త లక్ష్యాలకు మార్గం ఏర్పడుతుంది

* ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ నా వద్ద బ్యాంక్ పాస్ బుక్ ఉందని గర్వంగా చెప్పుకుంటారు.

* జనవరి 26లోగా జన ఖాతా తీసుకుంటే రూ. లక్ష బీమా సదుపాయం.

* జన్ ధన్ యోజన ప్రకటించిన 15 రోజుల్లోనే పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday launched Jan Dhan Yojana, a mega financial inclusion plan under which bank accounts and RuPay debit cards with inbuilt insurance cover of Rs 1 lakh will be provided to crores of persons with no access to formal banking facilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X