వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే చెంపదెబ్బ: సభలోనే చొక్కాలు విప్పి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్/లక్నో: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు పెప్పర్ స్ప్రేతోనే సరిపెట్టలేదు! సభలోనే చేయి చేసుకోవడాలు, చొక్కాలు విప్పడాలు చేస్తున్నారు.

భద్రతాధికారిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పక్షం ప్రతిపాదనలకు అడ్డు చెప్పేందుకు వస్తున్న ప్రతిపక్ష పిడిపి సభ్యుడు సయ్యద్ బషీర్ అహ్మద్ భద్రతా సిబ్బందిపై చేయి చేసుకున్నారు.

స్పీకర్ ఆదేశాల మేరకు సభ్యులను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్తుండగా పిడిపి నేత బషీర్ అహ్మద్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయనను అడ్డుకునేందుకు భద్రతాధికారి ప్రయత్నించారు. దీంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో బషీర్ అహ్మద్ ఆ అధికారి చెంప మూడుసార్లు ఛెళ్లుమనిపించారు.

యూపి

యూపి

రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యులు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో తమ కుర్తాలు విప్పి, ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

యూపి

యూపి

ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్ దళ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ కుర్తాలు విప్పారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ లోక్ దళ్ ఎమ్మెల్యేలు కుర్తా విప్పారు.

యూపి

యూపి

ఉదయం పదకొండు గంటలకు యూపి శాసన సభ ప్రారంభమైంది. బిఎస్పీ సభ్యులు బెంచీలపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ దశలో రాష్ట్రీయ లోక్ దళ్‌కు చెందిన ఎమ్మెల్యేలు వీర్ పాల్, సురేష్ శర్మలు తమ కుర్తాలు విప్పేశారు.

యూపి

యూపి

చెరకు రైతుల డ్యూలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వారిపై మంత్రి అజం ఖాన్ మండిపడ్డారు. రాష్ట్రాన్నిలూటీ చేసిన వారికి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.

చొక్కాలు విప్పిన ఎమ్మెల్యేలు

మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్ దళ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ కుర్తాలు విప్పారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ లోక్ దళ్ ఎమ్మెల్యేలు కుర్తా విప్పారు.

ఉదయం పదకొండు గంటలకు యూపి శాసన సభ ప్రారంభమైంది. బిఎస్పీ సభ్యులు బెంచీలపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ దశలో రాష్ట్రీయ లోక్ దళ్‌కు చెందిన ఎమ్మెల్యేలు వీర్ పాల్, సురేష్ శర్మలు తమ కుర్తాలు విప్పేశారు. తెరుకు రైతుల డ్యూలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వారిపై మంత్రి అజం ఖాన్ మండిపడ్డారు. రాష్ట్రాన్నిలూటీ చేసిన వారికి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.

English summary
Who better than the elected representatives can put “sincere” efforts to make India live up to its promise of being a 'land full of surprises'. Be it MPs or MLAs, all of them strive to improve our image, each passing day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X