వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ 200 వర్సిటీల్లో భారత్‌కు దక్కని చోటు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

No Indian university on top 200 list
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్ 200 విద్యాసంస్దల్లో ఒక్క భారత విద్యాసంస్ధ కూడా చోటు సంపాదించుకోలేక పోయింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాబితా 2014-15 సంవత్సరానికి గాను జరిపిన సర్వేలో ఐఐటీ బాంబే... ఇండియాలో మొదటి స్దానంలో నిలవగా, ప్రపంచంలో 222వ స్దానంలో నిలిచింది.

గత ఏడాది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్దానంలో ఉన్న ఐఐటీ ఢిల్లీ, ఈ సారి సెకండ్ ర్యాంక్‌కు పడిపోయి, ప్రపంచ వ్యాప్తంగా 235వ స్దానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ (321), ఐఐటీ ఖరగ్ పూర్ (324), ఐఐటీ రూర్కీ (461) , యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ(430), ఐఐటీ గౌహతి (551), యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా (650) ప్లేసుల్లో ఉన్నాయి.

మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలవగా, లండన్ లోని ఇంపేరియల్ కాలేజి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసియా నుంచి నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌కు అత్యుత్తమంగా 22వ ర్యాంకు లభించింది.

English summary

 Not a single Indian higher education institution has made it to the top 200 of the QS World University Rankings, which were released on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X